కామారెడ్డి, ఏప్రిల్ 7
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజాంసాగర్ ఎంపీడీవో కార్యాలయంలో గురువారం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ దళిత బంధు లబ్ధిదారులతో సమావేశం నిర్వహించారు. టెంట్ హౌస్, సెంట్రింగ్ పనులకు సంబంధించిన కొటేషన్లను లబ్ధిదారుల ఎదుట ఇప్పించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడారు.
దళిత జీవితాల్లో వెలుగులు నింపాలనే ఉద్దేశంతోనే ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు దళిత బంధు పథకాన్ని ప్రవేశపెట్టారని తెలిపారు. లబ్ధిదారులు యూనిట్లు తీసుకున్న తర్వాత వాటి ద్వారా సంపాదించుకునే ప్రతి రూపాయి వారికే చెందుతుందని చెప్పారు. వ్యవసాయ అనుబంధమైన యూనిట్లను లబ్ధిదారుల ఎంపిక చేసుకోవాలని సూచించారు. డెఈరీ, పౌల్ట్రీ, గొర్రెలు, మేకలు, చేపల పెంపకం వంటి యూనిట్లను ఎంచుకొని తక్కువ పెట్టుబడితో లాభాలు పొందాలని పేర్కొన్నారు.
సమావేశంలో జిల్లా ఉద్యాన అధికారి సంజీవ రావు, ఆర్డీవో రాజా గౌడ్, ఎంపీడీవో పర్బన్న, తహసీల్దార్ నారాయణ, అధికారులు పాల్గొన్నారు.