డిచ్‌పల్లి, ఏప్రిల్ 7
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఉస్మానియా అరుణతార, ప్రగతిశీల విద్యార్థి ఉద్యమ నిర్మాత కామ్రేడ్ జార్జిరెడ్డి 50 వర్ధంతి సభల పోస్టర్లను పి.డి.ఎస్.యు, పి.వై.ఎల్ జిల్లా కమిటీల ఆధ్వర్యంలో తెలంగాణ యూనివర్సిటీ, ఆర్ట్స్ కాలేజి ముందు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పి.డి.ఎస్.యు జిల్లా అధ్యక్షురాలు కల్పన, పీ.వై.ఎల్ జిల్లా అధ్యక్షులు కిషన్ మాట్లాడుతూ విప్లవ విద్యార్థి పోరు కెరటం కామ్రేడ్ జార్జిరెడ్డి అమరత్వం పొంది ఈ నెల ఏప్రిల్ 14 నాటికి 50 సంవత్సరాలు పూర్తవుతుందన్నారు. ఈ నేపథ్యంలో ఏప్రిల్ 14 వరకు గ్రామ, మండల, జిల్లా, యూనివర్సిటీల స్థాయిలో జార్జ్ రెడ్డి వర్ధంతి సభలను విస్తృతంగా నిర్వహిస్తున్నామన్నారు.
ఏప్రిల్ 13 న ఉస్మానియా యూనివర్సిటీ, హైదరాబద్ లో మధ్యాన్నం రెడ్ షర్ట్స్ కవాతు, సాయంత్రం వేలాది మంది విద్యార్థులతో భారీ బహరంగసభ, ఏప్రిల్ 14 న ఉదయం మార్నింగ్ వాక్, జార్జ్ రెడ్డి స్థూపానికి నివాళులు, సాయంత్రం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జార్జిరెడ్డి మిత్రులు, పి.డి.ఎస్.యు పూర్వ విద్యార్థులతో సదస్సు ఉంటుందన్నారు.
కార్యక్రమాల్లో విద్యార్థులు, మేధావులు, యువత పెద్దసంఖ్యలో పాల్గొని విజయవంతం చెయ్యాలని పిలుపునిచ్చారు. పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో పి.డి.ఎస్.యు జిల్లా ఉపాధ్యక్షుడు ఎం.నరేందర్, పీ.వై.ఎల్ జిల్లా ప్రధాన కార్యదర్శి సుమన్, నాయకులు మనోజ్, పీ.డీ.ఎస్.యు నాయకులు నిఖిల్, అశుర్, ప్రణయ్, నరేష్, వంశీ, చందు, అరుణ తార, లావణ్య, రమేష్, సాయిలు తదితరులు పాల్గొన్నారు.