మాచారెడ్డి, ఏప్రిల్ 7
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మాచారెడ్డి మండలంలో ప్రతి కుటుంబానికి 100 రోజుల పని కల్పించాలని జిల్లా స్థానిక సమస్తల అదనపు కలెక్టర్ వెంకటేష్ ధోత్రే అన్నారు. గురువారం మాచారెడ్డి ఎంపిడిఓ కార్యాలయంలో పంచాయతీ కార్యదర్శిలతో సమావేశాన్ని నిర్వహించారు. నూతన ఆర్థిక సంవత్సరం ప్రారంభమైన దృష్ట్యా కూలీలకు వంద రోజుల పనిదినాలు కల్పించాలని పేర్కొన్నారు. ఎంపీడీవో బాలకృష్ణ, కార్యదర్శులు పాల్గొన్నారు.
ఉపాధి పనుల్లో కూలీల సంఖ్య పెంచాలని జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ వెంకటేష్ ధోత్రే అన్నారు. కామారెడ్డి ఎంపీడీవో కార్యాలయంలో గురువారం పంచాయతీ కార్యదర్శిలతో సమావేశం నిర్వహించారు. పల్లె ప్రగతి పనులు పూర్తిచేయాలని ఆదేశించారు. నర్సరీలో మొక్కల సంరక్షణ చేపట్టాలన్నారు. హరిత హారంలో నాటిన మొక్కలు ఎండిపోకుండా చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎంపిడిఓ నాగేశ్వర్ రావు, కార్యదర్శులు పాల్గొన్నారు.