డిచ్‌పల్లి, ఏప్రిల్ 7
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయంలో అన్ని అనుబంధ పీజీ కళాశాలలో గల ఎం.ఎ., ఎం.ఎస్.డబ్ల్యూ., ఎం.ఎస్సీ., ఎం. కాం., ఎం.బి.ఎ., ఎం.సి.ఎ., ఐఎంబిఎ., ఎల్‌ఎల్‌ఎం, ఎల్‌ఎల్‌బి, బిఎల్‌ఐఎస్సీ. కోర్సులకు చెందిన 2006-2018 వరకు రెండు సంవత్సరాల బ్యాచ్ విద్యార్థులకు, 2006-2018 వరకు మూడు సంవత్సరాల బ్యాచ్ విద్యార్థులకు, 2006-2019 వరకు ఐదు సంవత్సరాల బ్యాచ్ విద్యార్థులకు చెందిన వన్ టైం చాన్స్ థియరీ అండ్ ప్రాక్టికల్ బ్యాక్ లాగ్ పరీక్షల ఫీజు గడువు ఈ నెల 19 వ తేదీ వరకు ఉందని పరీక్షల నియంత్రణాధికారి ఆచార్య ఎం. అరుణ షెడ్యూల్ విడుదల చేశారు. ఈ పరీక్షలు మే నెలలో నిర్వహించ తలపెట్టినట్లు ఆమె పేర్కొన్నారు.
అంతేగాక 100 రూపాయల అపరాధ ఆలస్య రుసుముతో ఈ నెల 23 వ తేదీ వరకు ఈ పరీక్షా ఫీజు చెల్లించవచ్చని ఆమె పేర్కొన్నారు. కావున ఈ విషయాన్ని పీజీ కళాశాలల ప్రధానాచార్యులు, పీజీ బ్యాక్ లాగ్ విద్యార్థులు గమనించాలని కోరారు. పూర్తి వివరాలకు తెలంగాణ యూనివర్సిటి వెబ్ సైట్‌ను సందర్శించాలని సూచించారు.