దోమకొండలో నల్ల జెండాలతో నిరసన

దోమకొండ, ఏప్రిల్‌ 8

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : యాసంగిలో పండిరచిన వరి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని డిమాండ్‌ చేస్తూ దోమకొండ మండల కేంద్రంలో నిర్వహించిన నిరసన ధర్నా కార్యక్రమంలో ప్రభుత్వ విప్‌ గంప గోవర్ధన్‌ పాల్గొని మోడీ దిష్టి బొమ్మ దహనం చేశారు. అనంతరం గ్రామంలో పలు ఇళ్లపై నల్ల జెండాలను ఎగర వేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ మెడలు వంచి తెలంగాణ రాష్ట్రంలో పండిరచిన వరి ధాన్యాన్ని కేంద్ర ప్రభుత్వమే కొనుగోలు చేసే వరకు నిరసన కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. కేంద్ర మంత్రి పియుష్‌ గోయల్‌ వ్యాఖ్యలకు మేము నూకలు తింటామో మీ ప్రభుత్వానికి నూకలు చెల్లే కాలం ముందరుందని హెచ్చరించారు. కార్యక్రమంలో దోమకొండ మండల పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Check Also

దివ్యాంగులకు క్రీడా పోటీలు

Print 🖨 PDF 📄 eBook 📱 నిజామాబాద్‌, నవంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »