ప్రజాపంథా పార్టీ నగర కార్యదర్శిగా సుధాకర్‌

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 8

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సీపీఐ (ఎం.ఎల్‌) ప్రజాపంథా పార్టీ నిజామాబాద్‌ నగర కమిటీ నిర్మాణ జనరల్‌ బాడీ సమావేశం ఎన్‌.ఆర్‌ భవన్‌, కోటగల్లిలో జరిగింది. సమావేశంలో నిజామాబాద్‌ నగర కార్యదర్శిగా ఎం.సుధాకర్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా నగర కార్యదర్శి ఎం.సుధాకర్‌ మాట్లాడుతూ నగర ప్రజల కనీస అవసరాలు కూడా తీర్చడంలో ప్రభుత్వాలు, అధికారులు విఫలమయ్యారన్నారు.

నిజామాబాద్‌ నగర పరిధిలోని 60 డివిజన్లలో ప్రజా సమస్యల పరిష్కారం కోసం, ప్రజా ఉద్యమాలను బలోపేతం చేయడం కోసం బాధ్యతగా పని చేస్తానని తెలిపారు. ప్రజా సంఘాల నిర్మాణాన్ని పటిష్టం చేస్తామన్నారు.

Check Also

దివ్యాంగులకు క్రీడా పోటీలు

Print 🖨 PDF 📄 eBook 📱 నిజామాబాద్‌, నవంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »