నిజామాబాద్, ఏప్రిల్ 9
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ (ఐ.ఎఫ్.టీ.యూ) 15వ జిల్లా మహాసభ శుక్రవారం నిజామాబాద్ జిల్లా, ఎడపల్లి మండలం, జానకం పేట్‌లో నిర్వహించారు. ఈ నేపథ్యంలో యూనియన్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో శ్రామిక భవన్, కోటగల్లిలో ప్రెస్ మీట్ నిర్వహించారు.
ఈ సందర్భంగా యూనియన్ జిల్లా అధ్యక్షులు డి.రాజేశ్వర్, ప్రధాన కార్యదర్శి ఎం.వెంకన్న మాట్లాడుతూ శుక్రవారం జరిగిన మహాసభలో గత మహాసభ నుండి ఇప్పటిదాకా జరిగిన ఉద్యమాలను సమీక్షించుకొని భవిష్యత్ ఉద్యమాలకు రూపకల్పన చేశామన్నారు. మహాసభలో పాల్గొని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి యూనియన్ జిల్లా కమిటీ తరుపున ధన్యవాదాలు తెలిపారు. మహాసభలో నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్టు పేర్కొన్నారు.
జిల్లా అధ్యక్షులుగా డి.రాజేశ్వర్, జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఎం. వెంకన్న, ఉపాధ్యక్షులుగా బి. మల్లేష్, ఉపాధ్యక్షురాలిగా ఎం. సత్యక్క, సహాయ కార్యదర్శులుగా డి.కిషన్, ఆర్.రమేష్, ఆర్గనైజింగ్ కార్యదర్శిగా కె. వసంత, ఇందిరా, కోశాధికారిగా యు. లాలయ్య, అలాగే 16 మంది సభ్యులను ఎన్నుకున్నారు.