నిజామాబాద్, ఏప్రిల్ 10
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం ప్రతి సోమవారం కలెక్టరేట్లోని ప్రగతి భవన్‌లో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని తాత్కాలికంగా వాయిదా వేయడం జరిగిందని కలెక్టర్ సి.నారాయణరెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.
ఈ నెల 11న సోమవారం రోజున మహాత్మా జ్యోతిబా పూలే జయంతి ఉత్సవాలను జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సందర్భంగా ప్రజావాణి కార్యక్రమాన్ని తాత్కాలికంగా వాయిదా వేయడమైనదని వివరించారు. వచ్చే సోమవారం నుండి ఈ కార్యక్రమం తిరిగి యధావిధిగా కొనసాగుతుందని తెలిపారు. ఈ విషయాన్ని జిల్లా ప్రజలు గమనించి అధికార యంత్రాంగానికి సహకరించాలని కోరారు.