కామారెడ్డి, ఏప్రిల్ 12
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : గాంధారి లో నిర్మిస్తున్న ఆయుష్ వెల్ నెస్ సెంటర్ ను వారం రోజుల్లో పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అధికారులను ఆదేశించారు. మంగళవారం గాంధారీ కమ్మ్యూనీటి హెల్త్ సెంటర్ సమీపంలో పైలట్ ప్రాజెక్టుగా నిర్మిస్తున్న ఆయుష్ వెల్ నెస్ సెంటర్ నిర్మాణ పనులను జిల్లా కలెక్టర్ క్షేత్ర స్థాయిలో పరిశీలించారు.
ఆయుష్ వెల్ నెస్ సెంటర్ నిర్మాణ పనులను వారం రోజుల్లో పూర్తి చేసి సాధ్యమైనంత త్వరగా పూర్తి చేసి వినియోగంలోకి తీసుకురావాలన్నారు. వెల్ నెస్ సెంటర్ ఫలితాలు బాగుంటే జిల్లాలో మిగతా చోట్ల వీటి నిర్మాణం చేపడతామని కలెక్టర్ స్పష్టం చేశారు.