కామారెడ్డి, ఏప్రిల్ 13
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నూతన జోనల్ విధానం వల్ల ఇటీవల జరిగిన పోలీసు హెడ్ కానిస్టబుల్ పదోన్నతుల్లో కామారెడ్డి జిల్లా కానిస్టేబుల్ మిత్రులకు తీవ్ర అన్యాయం జరిగిందని భారతీయ జనతా పార్టీ కామారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గ ఇన్‌చార్జి కాటిపల్లి వెంకట రమణా రెడ్డి అన్నారు. తెలంగాణ ఏర్పడితే సరిjైున న్యాయం జరుగుతుందని ఆశించిన ఉద్యోగులకు తెలంగాణ ఆవిర్భావం తర్వాత ఏర్పడిన నూతన జోనల్ విధానంలో అన్యాయమే జరిగిందని ఆందోళన వ్యక్తం చేశారు.
కొత్త జోనల్ ప్రకారం ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని నిజామాబాద్‌ను 2వ జోన్‌కి, కామారెడ్డిని 3వ జోన్‌కి మార్చారని అన్నారు. ఇటీవల జరిగిన హెడ్ కానిస్టేబుల్ పదోన్నతుల్లో 3 వ జోన్‌కి సంబంధించి 394 పదోన్నతులకు గాను 170 మందికి పదోన్నతి వస్తె కామారెడ్డి జిల్లాలో కేవలం 5 కానిస్టేబుల్‌లకు మాత్రమే పదోన్నతి వచ్చిందని, 2వ జోన్‌లో 89 పదోన్నతులకు గాను ఒక్కటి మాత్రమే నిజామాబాద్ జిల్లా వారికి పదోన్నతి లభించిందని అన్నారు.
కొత్త జోనల్ విధానం వల్ల సిరిసిల్ల, సిద్దిపేట జిల్లాల వారికి మాత్రమే లాభం ఉంది కాని ఉమ్మడి నిజామాబాద్ ఉద్యోగులకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని అన్నారు. ఉద్యోగులు దాదాపు 200 కిలోమీటర్ల దూరం వెళ్లి ఉద్యోగం చేయాల్సి వస్తుందని కావున జోనల్ విషయంలో ప్రభుత్వం పునరాలోచించాలని అన్నారు.