హనుమాన్‌ జయంతికి పటిష్ట ఏర్పాట్లు

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 13

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : హనుమాన్‌ జయంతి ఉత్సవాలలో భాగంగా శనివారం, జరగనున్న ఊరేగింపు వేడుకలను సజావుగా నిర్వహించుటకు, హైదరాబాద్‌ పోలీసు ఛీఫ్‌ సి.వి.ఆనంద్‌ అధ్యక్షతన, తన కార్యాలయం బషీర్‌ బాగ్‌ నందు ఏర్పాటుచేసిన అంతర్‌ శాఖా సమన్వయ సమావేశానికి సైబరాబాద్‌, రాచకొండ పోలీసు కమీషనరేట్‌ పరిధిలోని పోలీసు అధికారులు, జీహెచ్‌ఎంసీ అధికారులు, ఇఏంఆర్‌ఐ, ఆర్‌అండ్‌బీ, విద్యుత్‌, అగ్నిమాపక శాఖల ఉన్నతాధికారులు హాజరయ్యారు.

సిపి ఆనంద్‌ సమావేశానికి హాజరైన అన్ని శాఖల అధికారులను ఉద్దేశించి మాట్లాడుతూ పటిష్ఠమైన బారికాడిరగ్‌ ఏర్పాటు చేయాలని, నిరంతరాయ విద్యుత్‌ పంపిణీ ఉండాలని తెలిపారు. అదేవిధంగా అడ్డుగా ఉన్న చెట్ల కొమ్మలను కత్తిరించుట, దారికి అడ్డుగా ఉన్న ఇతర వ్యర్థ పదార్థాలను తొలగించాలని సూచించారు. మెకానిక్‌లు, డ్రైవర్లను నియమించవలసిందిగా ఆర్‌టిసి అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. ప్రధాన ఊరేగింపు మార్గంలో ఆంబులెన్స్‌లను ఏర్పాటు చేయాలని ఇఏమ్‌ ఆర్‌ఐ అధికారులకు సూచించారు.

హనుమాన్‌ జయంతి రోజున జరిగే ఊరేగింపు కార్యక్రమాన్ని జాయింట్‌ కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ నందు పర్యవేక్షించుటకు సీనియర్‌ పోలీసు అధికారులను నియమించటం ద్వారా క్షేత్ర స్థాయి సిబ్బందికి సూచనలు, అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా వేగంగా సమాచారం అందించవచ్చని సిపి ఆనంద్‌ అన్నారు. ‘‘శోభయాత్ర సమయంలో భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకొని, నగర పోలీసు యంత్రాంగం విస్తృతమైన భద్రతా ప్రణాళికను రూపొందించిందని. శాంతిభద్రతల విషయంలో అప్రమత్తంగా ఉండాలని ఎస్‌హెచ్‌ఓలకు మార్గదర్శకాలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇతర ప్రభుత్వ శాఖలకు చెందిన క్షేత్ర స్థాయి అధికారులతో సహకరించి పరస్పర సమన్వయంతో వ్యవహరించాలి’’ అని సిపి సి.వి.ఆనంద్‌ సూచించారు.

అడిషనల్‌ సిపి లా అండ్‌ ఆర్డర్‌ డి.ఎస్‌ చౌహాన్‌ ఐపిఎస్‌, జాయింట్‌ సిపి స్పెషల్‌ బ్రాంచ్‌ పి.విశ్వ ప్రసాద్‌ ఐపిఎస్‌, జాయింట్‌ సిపి (అడ్మిన్‌) ఎం.రమేశ్‌ ఐపిఎస్‌, జాయింట్‌ సిపి ట్రాఫిక్‌ ఏ.వి.రంగనాథ్‌ ఐపిఎస్‌, హైదరాబాద్‌ ట్రాఫిక్‌ డిసిపి ఎన్‌.ప్రకాష్‌ రెడ్డి ఐపిఎస్‌, హైదరాబాద్‌ ట్రాఫిక్‌ డిసిపి పి.కరుణాకర్‌, సెంట్రల్‌ జోన్‌ డిసిపి రాజేశ్‌ చంద్ర ఐపిఎస్‌, డిసిపి నార్త్‌ జోన్‌ చందన దీప్తి ఐపిఎస్‌, రాచకొండ ట్రాఫిక్‌ డిసిపి డి.శ్రీనివాస్‌, రాచకొండ ట్రాఫిక్‌ అడిషనల్‌ డిసిపి కె.ప్రసాద్‌, హైదరాబాద్‌ హెచ్‌ఓ ఏసిపి స్నేహ మెహ్రా ఐప్షిఎస్‌, సైబరాబాద్‌ ఎస్‌బి ఏసిపి రామచంద్ర రెడ్డి, ఎల్‌బి నగర్‌ ఏసిపి శ్రీధర్‌ రెడ్డి, రాచకొండ ఏసిబి ఎస్‌బి ఎస్‌ఎన్‌ జావేద్‌, సికింద్రాబాద్‌ జిహెచ్‌ఎంసి జోనల్‌ కమిషనర్‌ బి.శ్రీనివాస్‌ రెడ్డి, జిహెచ్‌ఎంసి, జోనల్‌ కమిషనర్‌ ఖైరతాబాద్‌ ఎన్‌.రవికిరణ్‌, టిఎస్‌ పిడిసిఎల్‌ జిఎం ఆపరేషన్స్‌ కె.నరసింహస్వామి, సౌత్‌ టిఎస్‌ పిడిసిఎల్‌ డిఇ ఎండి.ఫరహత్‌ అలీ, ఫైర్‌ డిపార్ట్‌మెంట్‌ ఏడిఎఫ్‌ ఓఎస్‌ జెఎం పి.శ్రీనివాస్‌, టిఎస్‌ఆర్టిసి డిఎం జి.రాము, టిఎస్‌ఆర్టిసి ఎం.రామ్‌ మోహన్‌, ఏఇఆర్‌ అండ్‌ బి బి.లక్ష్మీనారాయణ, డిప్యూటీ. ఇఇ ఆర్‌ అండ్‌ బి కె.మోహన్‌ బాబు, ఆర్‌ఎఫ్‌ఓ అగ్నిమాపక శాఖ పాపయ్య, జిఎంహెచ్‌ఎంసి డబ్ల్యూఎస్‌ఎస్‌ బి పి.సంతోష్‌ కుమార్‌, డిఎంఇఎంఆర్‌ఐ (108) సి హెచ్‌ .నరేందర్‌ రెడ్డి, టిఎస్‌ఆర్‌టిసి డిఎం జాకీర్‌ హుస్సేన్‌, ఇఇ ఆర్‌ అండ్‌ బి జె.శ్రీనివాస్‌ తదితరులు సమావేశానికి హాజరయ్యారు.

Check Also

దివ్యాంగులకు క్రీడా పోటీలు

Print 🖨 PDF 📄 eBook 📱 నిజామాబాద్‌, నవంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »