కామారెడ్డి, ఏప్రిల్ 14
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని వీ.టి.ఠాకూర్ రక్తనిధి కేంద్రంలో కామారెడ్డి జిల్లా రెడ్ క్రాస్ సమన్వయకర్త,కామారెడ్డి రక్తదాతల నిర్వాహకుడు బాలు అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని 66 సారి రక్త దానం చేశారు.
ఈ సందర్భంగా బాలు మాట్లాడుతూ 2007వ సంవత్సరంలో కామారెడ్డి రక్తదాతల సమూహాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని రక్తం లేని కారణంగా ఏ ఒక్కరూ ప్రాణాలు కోల్పో కూడదనీ, ఆపదలో ఉన్న వారికి సకాలంలో రక్తాన్ని అందించాలనే మంచి సంకల్పంతో ఈ సమూహాన్ని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.
ఇప్పటివరకు 10 వేల యూనిట్ల రక్తాన్ని సకాలంలో అందించడం జరిగిందని, కరోనా సమయంలో 100 యూనిట్ల ప్లాస్మాను, 850 యూనిట్ల రక్తాన్ని అందజేసి సామాజిక స్పృహను చాటడం జరిగిందన్నారు. ఆపదలో ఉన్న వారికి ఎల్లవేళలా రక్తం అందించడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. కార్యక్రమంలో సభ్యులు కుంభాల లక్ష్మణ్ యాదవ్, గంప ప్రసాద్, ఆకుల శివకృష్ణ, నీల నాగరాజు, నర్సింలు, టెక్నీషియన్ చందన్ పాల్గొన్నారు.