నిజామాబాద్, ఏప్రిల్ 17
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం ప్రతి సోమవారం కలెక్టరేట్లోని ప్రగతి భవన్లో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని యధావిధిగా నిర్వహించడం జరుగుతుందని కలెక్టర్ సి.నారాయణరెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.
ఈ నెల 11న మహాత్మా జ్యోతిబా పూలే జయంతి ఉత్సవాలను జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో నిర్వహించిన సందర్భంగా గత సోమవారం ప్రజావాణి కార్యక్రమాన్ని తాత్కాలికంగా వాయిదా వేశామని అన్నారు. ప్రస్తుతం ఈ కార్యక్రమం తిరిగి యధావిధిగా కొనసాగుతుందని కలెక్టర్ తెలిపారు.