కామారెడ్డి, ఏప్రిల్ 18
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రాష్ట్ర షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌కు జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ సోమవారం కలిసి మొక్కను అందజేశారు. హైదరాబాద్ నుంచి నిర్మల్ వెళ్తుండగా మార్గమధ్యంలో టేక్రియాల్ శివారులోని ఓ హోటల్ వద్ద కొద్దిసేపు ఆగారు.
కార్యక్రమంలో జిల్లా ఎస్సీ కార్పొరేషన్ ఈడీ దయానంద్, జిల్లా షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖ అధికారిణి రజిత, ఉద్యోగులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కామారెడ్డిలో టిఎన్జిఎస్ ఆధ్వర్యంలో ఘన స్వాగతం పలికారు. ఆయనకు పుష్పగుచ్ఛంను టీఎన్జీవోఎస్ ప్రతినిధులు అందజేశారు. ఉద్యోగుల సమస్యలపై టీఎన్జీవోఎస్ ప్రతినిధులు మంత్రితో చర్చించారు. టీఎన్జీవోస్ జిల్లా అధ్యక్షుడు నరాల వెంకట్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి సాయిలు, ప్రతినిధులు పాల్గొన్నారు.