కామారెడ్డి, ఏప్రిల్ 19
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని శ్రీ విష్ణు వైద్యశాలలో ఆపరేషన్ నిమిత్తమై పూజిత (21)కు ఏబి నెగెటివ్ రక్తం అవసరం కావడంతో వారికి కావాల్సిన రక్తం నిజామాబాద్ రక్తనిధి కేంద్రాలలో లభించకపోవడంతో వారి బంధువులు కామారెడ్డి జిల్లా రెడ్ క్రాస్ సమన్వయకర్త, కామారెడ్డి రక్తదాతల సమూహ నిర్వాహకుడు బాలును సంప్రదించారు.
వెంటనే గిద్ద గ్రామానికి చెందిన రక్తదాత సంతోష్ సహకారంతో ఏబి నెగిటివ్ రక్తాన్ని సకాలంలో అందించారు. గత 14 సంవత్సరాల నుండి అరుదుగా లభించే రక్త గ్రూపులు అయినా ఏబి నెగిటివ్,ఏ నెగిటివ్,బి నెగిటివ్, ఓ నెగిటివ్ ల రక్తాన్ని కూడా దాతల సహకారంతో సకాలంలో అందించడం జరుగుతుందని అన్నారు. రక్తదానానికి ముందుకు వచ్చిన రక్తదాతను అభినందించారు. కార్యక్రమంలో వి.టి.ఠాకూర్ బ్లడ్ బ్యాంక్ టెక్నీషియన్ చందన్ పాల్గొన్నారు.