కామారెడ్డి, ఏప్రిల్ 19
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి పట్టణంలోని సరస్వతి శిశు మందిర్ ఉన్నత పాఠశాల ఆవరణలో జిల్లా వైద్య శాఖ ఆధ్వర్యంలో మంగళవారం మెగా హెల్త్ క్యాంప్‌ను జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ ప్రారంభించారు. ఆయుష్మాన్ భారత్, ఆజాద్ కా అమృత్ మహోత్సవంలో భాగంగా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసినట్లు చెప్పారు.
కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రి పరిధిలోని ఆరోగ్య కేంద్రాల ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. జిల్లా వైద్యాధికారి లక్ష్మణ్ సింగ్, వైస్ చైర్ పర్సన్ ఇందు ప్రియా, జిల్లా ఉప వైద్యాధికారి చంద్రశేఖర్ పాల్గొన్నారు.