వడదెబ్బ జాగ్రత్తలు – కరపత్రాల ఆవిష్కరణ

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 19

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వడదెబ్బ జాగ్రత్తలు అవగాహన తదితర అంశాలపై ఇండియన్‌ రెడ్‌ క్రాస్‌ సొసైటీ నిజామాబాద్‌ మరియు ఇందూర్‌ మదర్‌ హుడ్‌ హాస్పిటల్‌ సంయుక్త ఆధ్వర్యంలో ప్రజలను అప్రమత్తం చేయడానికి పలు సూచనలు సలహాలు అవగాహన కరపత్రాలు జిల్లా కలెక్టర్‌ నారాయణ రెడ్డిచే విడుదల చేయించారు.

ఈ సందర్భంగా అవగాహన కార్యక్రమాలు చేయడం రెడ్‌ క్రాస్‌ సొసైటీ అభినందనీయమని అన్నారు. అదేవిధంగా రెడ్‌ క్రాస్‌ సొసైటీకి రెండు లక్షల యాభై ఒక్క వెయ్యి విరాళాలు సేకరించి అందజేసిన ఇందూర్‌ మదర్‌ హుడ్‌ హాస్పిటల్‌ ప్రముఖ గైనకాలజిస్ట్‌ డాక్టర్‌ తేజస్విని అభినందించారు. కార్యక్రమంలో రెడ్‌ క్రాస్‌ సొసైటీ జిల్లా చైర్మన్‌ బుస ఆంజనేయులు, రాపెల్లి రవీందర్‌, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తోట రాజశేఖర్‌, జిల్లా కోశాధికారి కరీపే రవీందర్‌, సభ్యులు వెంకటేష్‌ తదితరులు పాల్గొన్నారు.

Check Also

దివ్యాంగులకు క్రీడా పోటీలు

Print 🖨 PDF 📄 eBook 📱 నిజామాబాద్‌, నవంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »