బాన్సువాడ, ఏప్రిల్ 20
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బాన్సువాడ పట్టణ (చింతల్ నాగారం) శివారులో నూతనంగా 14 కోట్లతో నిర్మిస్తున్న చెక్ డ్యాం పనులను బుధవారం స్థానిక నాయకులు ప్రజా ప్రతినిదులతో కలిసి ఉమ్మడి నిజామాబాద్ జిల్లా డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి పరిశీలించారు.
ఈ సందర్భంగా భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ చెక్ డ్యాం నిర్మాణ అనుమతులు మంజూరు చేసిన ముఖ్యమంత్రి కెసీఆర్‌కి, తెలంగాణ రాష్ట్ర శాసన సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డికి దన్యవాదాలు తెలిపారు. చెక్ డ్యాం నిర్మాణం వలన 365 రోజులు నీరు నిలువ ఉండి భూగర్భ జలాలు పెరుగుతాయని తెలిపారు.
రైతుల కోసం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న రైతుబంధు, రైతుభీమా, ఉచిత కరెంటు, రైతులు పండిరచిన పంటను మద్దతు ధరతో కొనడం వలన రైతులు తెరాసా ప్రభుత్వం పట్ల సంతోషంగా ఉన్నారని తెలిపారు. కార్యక్రమంలో బాన్సువాడ మండల నాయకులు, ప్రజాప్రతినిదులు, కార్యకర్తలు పాల్గొన్నారు.