రాష్ట్రమంతటా కోచింగ్‌ సెంటర్లు

డిచ్‌పల్లి, ఏప్రిల్‌ 20

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి ఆధ్వర్యంలో బుధవారం మధ్యాహ్నం వర్చువల్‌ వేదికగా ఆన్‌ లైన్‌లో తెలంగాణ రాష్ట్రంలోని ఆరు విశ్వవిద్యాలయాలలో ప్రత్యేకంగా పోటీ పరీక్షల విభాగాలను ప్రారంభించారు. ఉస్మానియా, కాకతీయ, తెలంగాణ, మహాత్మాగాంధీ, శాతవాహన, పాలమూరు విశ్వవిద్యాలయాలలో కోచింగ్‌ సెంటర్స్‌ ప్రారంభించారు.

కార్యక్రమంలో తెలంగాణ విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య డి. రవీందర్‌, రిజిస్ట్రార్‌ ఆచార్య కె. శివశంకర్‌, కాంపిటేటీవ్‌ సెల్‌ డైరెక్టర్‌ డా. బాల శ్రీనివాస మూర్తి, యూజీసీ సెల్‌ డైరెక్టర్‌ డా. ఆంజనేయులు, పీఆర్‌ఓ డా. వి. త్రివేణి తదితర పోటీ పరీక్షలకు సంసిద్ధమయ్యే విద్యార్థులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ… తెలంగాణ రాష్ట్ర ముఖ్య మంత్రి కలువకుంట్ల చంద్రశేఖర్‌ రావు సహకారంతో దేశంలోనే మొట్టమొదటి సారిగా తెలంగాణ రాష్ట్రంలో ప్రతిష్టాత్మకమైన విశ్వవిద్యాలయాలలో పోటీ పరీక్షల విభాగాన్ని ఏర్పాటు చేయడం ఆనందదాయకమని అన్నారు. ముఖ్య మంత్రి ఎనభై వేలకు పైగా ప్రభుత్వ ఉద్యోగాలు ప్రకటించడం ఎంతో హర్షించదగిన పరిణామమని అన్నారు.

యువత ఉద్యోగాల కోసం ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్న ప్రకటనలు వెలువడుతున్నాయని అన్నారు. మొదట ఇది వరకు కాంట్రాక్ట్‌ ఉద్యోగాలలో ఉన్నవారిని పర్మనెంట్‌ చేసే ప్రయత్నంలో ఉన్నామన్నారు. అన్ని విభాగాలలో ఉన్న ఖాళీలను గుర్తించి, వాటికి జోనల్‌, జిల్లా పరిధుల్లో ఖాళీ ఉద్యోగాల గుర్తింపు చేసినట్టుగా పేర్కొన్నారు. ప్రత్యేకంగా ముఖ్యమంత్రి రాష్ట్రపతి నుంచి జోనల్‌, జిల్లా అనుమతి ఉత్తర్వులు తీసుకొనిరావడంలో ప్రయత్నం చేసినట్టు తెలిపారు.

ఇది వరకు లక్షా నలభై వేలకు పై చిలుకు ఉద్యోగాలు భర్తీ చేయగా, నేడు అద్భుతంగా అన్ని విభాగాలలో ఎనభై లక్షలపై చిలుకు ఉద్యోగాలు ప్రకటించినట్లు ఆమె తెలిపారు. ప్రతి వ్యక్తికి జీవితంలో స్థిర పడాలని ఉంటుందని, అందుకోసం తమ నాలెడ్జును మెరుగుపరుచుకోవడం కోసం జీవితంలో విబిధ కోచింగ్‌ సెంటర్స్‌కు వెళ్తుంటారని అన్నారు. యూనివర్సిటీలో చదివే విద్యార్థులకు ఈ అవకాశం కల్పించడం కోసం కోచింగ్‌ సెంటర్స్‌ ఏర్పాటు చేస్తున్నమని అన్నారు. ముఖ్యమంత్రి కూడా క్యాబినెట్‌ మీటింగ్‌లో ఉన్నిత విద్యా మండలి చైర్మన్‌ ఆచార్య ఆర్‌. లింబాద్రిని ఈ విధమైన కార్యాన్ని తలపెట్టవలదిందిగా నిర్దేశించిన విషయాన్ని గుర్తు చేశారు. విద్యార్థులందరు అంకితభావంతో ముందడుగు చేసి జీవన లక్ష్యాన్ని సాధించాలని ఆమె కోరారు.

ఈ సందర్భంగా ఉన్నిత విద్యా మండలి చైర్మన్‌ ఆచార్య ఆర్‌. లింబాద్రి మాట్లాడుతూ ఆత్మ స్థైర్యం, నిరంతర కృషి, పట్టుదల, ఒక క్రమపద్దతిలో ఉద్యోగ సాధనకు కృషి, బోధనా నైపుణ్యాలు, సామర్థ్యాలు సాధించడం కోసం ఈ కోచింగ్‌ సెంటర్స్‌ ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. ఆరు విశ్వవిద్యాల్యాలలో నేడు పోటీ పరీక్షల విభాగాలను ప్రారంభించడానికి సరిjైున మార్గ నిర్దేశం కౌన్సిల్‌ నుంచి అందించినట్లుగా తెలిపారు.

ఈ సందర్భంగా టీయూ వీసీ మాట్లాడుతూ తెలంగాణ విశ్వవిద్యాలయంలో కాంపిటేటీవ్‌ సెల్‌ ఇది వరకే ఇందని ఈ ప్రభుత్వ ఉద్యోగాల ప్రకటన నేపథ్యంలో ఇంకా విస్తృతంగా శిక్షనను ఇవ్వడానికి పూనుకుంటున్నామని అన్నారు. మంచి లెక్చర్స్‌ ఇవ్వడానికి ప్రముఖ వక్తలను ఆహ్వానించబోతున్నట్లు తెలిపారు. భారత దేశ, తెలంగాణ సమగ్ర స్వరూపం, తెలంగాణ ఉద్యమ చరిత్ర, ఆర్థిక శాస్త్రం, మానవీయ శాస్త్రాలు, జనరల్‌ నాలేడ్జ్‌, టీచింగ్‌ స్కిల్స్‌ వంటి అనేక అంశాలను ఎజెండాగా తీసుకొని శిక్షణకు సిద్ధపడుతున్నట్లు తెలిపారు.

సెంట్రల్‌ లైబ్రెరీలో 5,000 పైగా పుస్తకాలు, 1400 పై జర్నల్స్‌ ఉన్నట్లు అన్ని ఆన్‌లైన్‌ జర్నల్స్‌ సబ్‌ స్క్రైబ్‌ చేసుకున్నట్లు తెలిపారు. ఇంకా 500 పుస్తకాలు ఖరీదు చేసుకోబోతున్నట్లు పేర్కొన్నారు. తెలంగాణ విశ్వవిద్యాలయం గ్రామీణ ప్రాంతంలో ఉందని, అత్యంత పేద విద్యార్థులు చదువుతున్నట్లుగా పేర్కొన్నారు. రిజిస్ట్రార్‌, డైరెక్టర్‌, తదితర అధ్యాపకుల సహకారంతో విద్యార్థులు జాబ్‌ మేళాలో తప్పకుండా ఉద్యోగాలు సాధిస్తారనే ఆశాభావాన్ని కలిగి ఉన్నట్లు పేర్కొన్నారు.

Check Also

దివ్యాంగులకు క్రీడా పోటీలు

Print 🖨 PDF 📄 eBook 📱 నిజామాబాద్‌, నవంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »