నిజామాబాద్, ఏప్రిల్ 20
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రభుత్వ ఆదేశాల మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో కంటిచూపు సమస్యలతో బాధపడుతున్న వారికి ఉచితంగా క్యాటరాక్ట్ ఆపరేషన్లు, మోకాలి నొప్పులతో ఇబ్బందిపడుతున్న వారికి శస్త్ర చికిత్సలు నిర్వహించడం జరుగుతుందని నిజామాబాద్ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ప్రతిమారాజ్ తెలిపారు.
ఆపరేషన్లు అవసరమైన వారిని గుర్తించేందుకు వీలుగా జిల్లా జనరల్ ఆసుపత్రి ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా స్క్రీనింగ్ క్యాంపులు నిర్వహిస్తున్నామని అన్నారు. ఇందులో భాగంగానే ఈ నెల 21న గురువారం భీమ్గల్, మోస్రా, రుద్రూర్, బీర్కూర్, పోతంగల్, సిరికొండ, ఇందల్వాయి, జక్రాన్పల్లి, ముదక్పల్లి, ఆర్మూర్, నవీపేట్, బాల్కొండ, మోర్తాడ్, వర్నిలలో స్క్రీనింగ్ క్యాంపులు జరుగుతాయన్నారు. అలాగే ఈ నెల 22న కోటగిరి, ధర్పల్లి, సాలూర, రెంజల్లో క్యాంపులు అందుబాటులో ఉంటాయని వివరించారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని డాక్టర్ ప్రతిమారాజ్ కోరారు.