నిజామాబాద్, ఏప్రిల్ 21
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు మే 6వ తేదీ నుండి 24 వ తేదీ మే వరకు కొనసాగుతాయని జిల్లా ఇంటర్మీడియట్ విద్య అధికారి రఘు రాజ్ ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్ర ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శి ఆదేశాల మేరకు పరీక్షల నిర్వహణకు పరీక్షా కేంద్రాల ఏర్పాటు, ప్రశ్నాపత్రాలను భద్రపరిచే ఏర్పాట్లు, తదితర సమస్యల పరిష్కారానికి అన్ని చర్యలు తీసుకుంటున్నామని డి.ఐ.ఈ.ఓ .వివరించారు.
జిల్లాలో 50 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని అన్ని పరీక్షా కేంద్రాలలో మంచి నీటి వసతి , మరుగుదొడ్ల వసతి, పరీక్ష కేంద్రాల్లో ఫ్యాన్లు, ప్రాథమిక చికిత్సకోసం మెడికల్ వసతులు ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. మొదటి సంవత్సరం విద్యార్థులకు (జనరల్, ఒకేషనల్) మే 6, 9, 11, 13, 16, 18, 20, 23 తేదీల్లో, రెండవ సంవత్సరం విద్యార్థులకు 7,10,12,14,17,19,21,24 తేదీల్లో పరీక్షలు నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నామని జిల్లా ఇంటర్ విద్యా అధికారి తెలిపారు.