డిచ్‌పల్లి, ఏప్రిల్ 21
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని ఇంటర్ ప్రిన్యూర్ షిప్ డెవలప్ మెంట్ సెల్ మరియు బిజినెస్ మేనేజ్ మెంట్ విభాగం సంయుక్త ఆధ్వర్యంలో ‘‘ప్రపంచ సృజనాత్మకత, నూతన ఆవిష్కరణల దినోత్సవం’’ ను గురువారం ఉదయం ఘనంగా నిర్వహించారు. అవగాహనా సదస్సును ఇంటర్ ప్రిన్యూర్ షిప్ డెవలప్ మెంట్ సెల్ డైరెక్టర్ డా. బి. నందిని, బిజినెస్ మెంట్ విజాగాధిపతి డా. కె. అపర్ణ, అధ్యాపకులు డా. సిహెచ్ ఆజనేయులు నిర్వహించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి వ్యక్తి జీవన వృద్ధి కోణంలో సృజనాత్మక, నూతన ఆవిష్కరణలు అనేవి నిత్యనూతనంగా జరుగుతూనే ఉంటాయని అన్నారు. ఒక వ్యక్తి పుట్టుక నుంచి మొదలుకొని ఎల్లప్పుడు ఏదో కొత్య విషయం నేర్చుకుంటూనే ఉంటాడని అన్నారు. తమ జీవల లక్ష్యాన్ని, గమ్యాన్ని ఏర్పరుచుకొని నిరంతరం ముందుకు కదులుతూనే ఉంటాడని అన్నారు. నేటి కాలంలో ప్రకృతి, సంస్కృతి వృద్ధిని పెంపొందించుకు ముందుకు వెళ్లడం అత్యవసరమని అన్నారు.
ప్రపంచవ్యాప్తంగా వాతావరణ కాలుష్యం భయోత్పాతానికి దారి తీస్తుందన్నారు. కరోనా లాంటి అంటు రోగాల నివారణకు మనం ప్రకృతికి, సంస్కృతికి పూర్వ వైభవం కలిగించాలని అన్నారు. తెలంగాణ రాష్ట్రం లాంటి కొత్త రాష్ట్రాలకు ఈ అభివృద్ధి అత్యవసరమని అన్నారు. సృజనాత్మకత, నూతన ఆవిష్కరణల ద్వారా మేలైన సాంకేతికతో పాటుగా సామాజిక, సాంస్కృతిక, మానసిక పరిపక్వత సాధించవచ్చని అన్నారు. ముఖ్యంగా విద్యార్థులు తమ సబ్జెక్టుల్లో క్రియేటివిటీని, ఇన్నోవేషన్స్ కలిగి ఉండాలని అభిలషించారు. మేధోపరమైన జ్ఞానాని, ఆలోచనా సామర్థ్యాన్ని పెంపొందించుకోవాలని అన్నారు.
కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన ఇంటర్ ప్రిన్యూర్ షిప్ డెవలప్ మెంట్ సెల్, బిజినెస్ మేనేజ్ మెంట్ విభాగం అధ్యాపకులను ఉపకులపతి ఆచార్య డి. రవీందర్, రిజిస్ట్రార్ ఆచార్య కె. శివశంకర్ అభినందించారు. ఇందులో బిజినెస్ మేనేజ్ మెంట్ విద్యార్థులు పాల్గొన్నారు.