రక్తహీనతతో బాధపడుతున్న మహిళలకు రక్తదానం

కామారెడ్డి, ఏప్రిల్‌ 22

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని వేరువేరు ప్రైవేటు వైద్యశాలలో రక్తహీనతతో బాధపడుతున్న మహిళలు స్వరూపకు ఏబి పాజిటివ్‌ రక్తాన్ని మరియు వనితకు ఓ పాజిటివ్‌ రక్తం సకాలంలో అందజేయడం జరిగిందని రెడ్‌ క్రాస్‌ జిల్లా సమన్వయకర్త, కామారెడ్డి రక్తదాతల సమూహ నిర్వాహకుడు బాలు తెలిపారు.

కామారెడ్డి జిల్లా కేంద్రానికి చెందిన గంప ప్రసాద్‌ తెలియజేయగానే వెంటనే స్పందించి సకాలంలో రక్తాన్ని అందజేయడం జరిగిందని, రక్తదానానికి ముందుకు రావడం స్ఫూర్తిదాయకమని, గతంలో కూడా చాలా సందర్భాల్లో అత్యవసర పరిస్థితుల్లో ఉన్నవారికి రక్తదానం చేసిన రక్తదాత గంప ప్రసాద్‌కు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో వీ.టి ఠాకూర్‌ బ్లడ్‌ బ్యాంక్‌ టెక్నిషియన్‌ ఏసు గౌడ్‌, లక్ష్మణ్‌, శివకృష్ణ, నాగరాజు పాల్గొన్నారు.

Check Also

నేటి పంచాంగం

Print 🖨 PDF 📄 eBook 📱 శనివారం, నవంబరు 23, 2024శ్రీ క్రోధి నామ సంవత్సరందక్షిణాయణం – శరదృతువుకార్తీక …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »