డిచ్‌పల్లి, ఏప్రిల్ 22
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని మాస్ కమ్యూనికేషన్ విభాగంలోని పరిశోధక విద్యార్థి గాలిపల్లి శ్రీశైలంకు పిహెచ్. డి. డాక్టరేట్ పట్టా ప్రదానం చేయబడిరది. ఆయన రూపొందించిన సిద్ధాంత గ్రంథం మీద తెలంగాణ విశ్వవిద్యాలయంలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల మినీ సెమినార్ హాల్‌లో శుక్రవారం ఓపెన్ వైవా వోస్ (మౌఖిక పరీక్ష) నిర్వహింపబడిరది.
మాస్ కమ్యూనికేషన్‌లో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పని చేసి, నేడు హైదరాబాద్‌లో గల ఇంగ్లీష్ అండ్ ఫారన్ లాంగ్వేజెస్ యూనివర్సిటిలోని కమ్యూనికేషన్ విభాగంలో బాధ్యతలు నిర్వర్తిస్తున్న అసిస్టెంట్ ప్రొఫెసర్ డా. కె. రాజారాం పర్యవేక్షణలో పరిశోధక విద్యార్థి గాలిపల్లి శ్రీశైలం ‘‘సంక్షోభ నిర్వహణలో ప్రజా సంబంధాల పాత్ర – ఎంపిక చేయబడిన సాంకేతిక సమాచార రంగం, ఫార్మా రంగం, ప్రభుత్వ సంస్థలపై ఒక అధ్యయనం’’ అనే అంశంపై పరిశోధన చేసి సిద్ధాంత గ్రంథం రూపొందించారు.
ఎక్స్ టర్నల్ ఎగ్జామినర్‌గా పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలోని జర్నలిజం విభాగం నుంచి రిటైర్డ్ ప్రొఫెసర్ కె. సుధీర్ కుమార్ హాజరై పరిశోధకుడిని పలు ప్రశ్నలు అడిగి సమాధానాలు రాబట్టి సంతృప్తి వ్యక్తం చేశారు. బెంగుళూరు, బల్లారి, రామగుండం, చెన్నయ్, గుర్ గావ్, పూనే, ముంబయ్ తదితర ప్రదేశాలను ఎంపిక చేసుకొని సాంకేతిక సమాచార, ఫార్మా రంగాలు, ప్రభుత్వ సంస్థలలో ప్రజా సంబంధాలు ఎలా ఉన్నాయో సరిjైున డాటా పరిశోధకుడు విశ్లేషించాడని అన్నారు.
ప్రజా సంబంధాల నిర్వహణ, మానవీయ సంబంధాల నిర్వహణ, సమాచార రంగాల నిర్వహణ వంటి తదితర రాంగాలలోని అభివృద్ధికి తీసుకోవలసిన అంశాలపై పరిశోధన కొనసాగించాడని అన్నారు. సమగ్రమైన గ్రాఫ్ నివేదికా పట్టికలను కూడా సమర్పించాడని అన్నారు. నేటి కరోనా అనంతర సంక్షోభ కాలానికి ఈ పరిశోధన కీలకంగా నిలుస్తుందని ప్రశంసించారు.
వైవా వోస్‌కు సోషల్ సైన్స్ డీన్ అండ్ రిజిస్ట్రార్ ఆచార్య కె. శివ శంకర్ చైర్మన్‌గా వ్యవహరించారు. మాస్ కమ్యూనికేషన్ విభాగాధిపతి డా. ఘంటా చంద్రశేఖర్, పార్ట్ టైం టీచర్స్ డా. మోహన్, డా. శ్రీనివాస్ గౌడ్ తదితర అధ్యాపకులు, పరిశోధకులు, విద్యార్థులు పాల్గొన్నారు.
మాస్ కమ్యూనికేషన్ విభాగంలో గాలిపల్లి శ్రీశైలం పిహెచ్. డి. సాధించడం పట్ల ఉపకులపతి ఆచార్య డి. రవీందర్, కంట్రోలర్ ఆచార్య ఎం. అరుణ, ప్రిన్సిపల్ ఆచార్య సిహెచ్. ఆరతి, పీఆర్‌ఓ డా. వి. త్రివేణి, యెండల ప్రదీప్, చరణ్ తదితర అధ్యాపకులు, పరిశోధకులు, విద్యార్థులు శుభాభినందనలు తెలిపారు.