నిజామాబాద్, ఏప్రిల్ 22
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామ్రేడ్ లెనిన్ 153 వ జయంతి, సి.పి.ఐ (ఎం.ఎల్) 53వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సీపీఐ (ఎం.ఎల్) ప్రజాపంథా నిజామాబాద్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఎన్.ఆర్ భవన్, కోటగల్లిలో జెండా ఆవిష్కరణ, కామ్రేడ్ విప్లవ నివాళులు అర్పించారు. ముందుగా పార్టీ జిల్లా కార్యదర్శి (ఇంచార్జి) వనమాల కృష్ణ ఎర్రజెండా ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా వనమాల కృష్ణ మాట్లాడుతూ పార్లమెంటరీ పద్ధతి, ఎన్నికల ద్వారా ఈ దేశ ప్రజలకు విముక్తి జరగదని, నూతన ప్రజాస్వామిక విప్లవం ద్వారానే ప్రజలకు విముక్తి అని సిపిఐ (ఎం.ఎల్) పార్టీ 1969లో ఆవిర్భవించిందన్నారు. మార్క్సిస్టు మహోపాద్యాయుడు కామ్రేడ్ లెనిన్ జయంతి రోజున ఏప్రిల్ 22న సీపీఐ (ఎం.ఎల్) పార్టీ ఆవిర్భవించిందన్నారు. భారతదేశంలో విప్లవాన్ని విజయవంతం చేయడం కోసం వేలాది మంది వీరులు అమరులయ్యారన్నారు. అమరవీరులకు ప్రజాపంథా విప్లవ నివాళులు అర్పిస్తున్నదన్నారు.
మార్క్సిస్టు సిద్ధాంతాన్ని వాస్తవ భౌతిక పరిస్థితులకు అనుకూలంగా అన్వయించి, బలమైన ప్రజా పోరాటాలను నిర్మించడమే సరైందని సిపిఐ (ఎం.ఎల్) ప్రజాపంథా భావిస్తున్నదన్నారు. పాలకవర్గాల ప్రజా వ్యతిరేక విధానాలపై ప్రజల్ని చైతన్యవంతం చేసి, ప్రజా ఉద్యమాలను నిర్మించడమే లక్ష్యంగా అమరవీరుల త్యాగాల స్ఫూర్తితో సీపీఐ (ఎం.ఎల్) ప్రజాపంథా ముందుకు వెళుతుందన్నారు. ఈ సందర్భంగా అరుణోదయ కళాకారులు విప్లవ గీతాలు ఆలపించారు.
కార్యక్రమంలో పార్టీ జిల్లా నాయకులు వి.ప్రభాకర్, కే. గంగాధర్, ఏం.వెంకన్న, దేవారం, ఎం.నరేందర్, ముత్తెన్న, మల్లేష్, రాజేశ్వర్, పార్టీ నగర కార్యదర్శి ఎం.సుధాకర్, నాయకులు ఆల్గోట్ రవీందర్, వి.గోదావరి, సంధ్యారాణి, సాయగౌడ్, కల్పన, నరేందర్, కిషన్, మురళి, మారుతి, రాజేశ్వర్, ప్రశాంత్, సాయితేజ, అశుర్, భాస్కర్ స్వామి, నర్సక్క, పావని, రాజేశ్వర్, నాగన్న, ఒడ్డెన్న, రమేష్, చరణ్ తదితరులు పాల్గొన్నారు.