Daily Archives: April 23, 2022

సోదర భావంతో పండుగలు జరుపుకోవాలి

కామారెడ్డి, ఏప్రిల్‌ 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : హిందూ, ముస్లింలు సోదర భావంతో పండుగలను నిర్వహించుకోవాలని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. టిఎన్‌జిఓఎస్‌ ఆధ్వర్యంలో కామారెడ్డి కలెక్టరేట్‌లో శనివారం రాత్రి ముస్లింలకు ఇఫ్తార్‌ విందు ఇచ్చారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ మాట్లాడారు. మతాలకతీతంగా ఐకమత్యంతో పండగలు జరుపుకోవాలని సూచించారు. టిఎన్‌జిఓఎస్‌ ఆధ్వర్యంలో ఇఫ్తార్‌ విందు ఏర్పాటు చేయడం అభినందనీయమని కొనియాడారు. రంజాన్‌ పండగ …

Read More »

నాన్‌ టీచింగ్‌ అండ్‌ వర్కర్లకు విధుల రొటేషన్‌ అమలు చేయాలి

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కేజీబీవీల్లో పనిచేస్తున్న నాన్‌ టీచింగ్‌ అండ్‌ వర్కర్లకు రొటేషన్‌ పద్ధతిలో విధుల మినహాయింపు ఇవ్వాలని ప్రగతిశీల కేజీబీవీ నాన్‌-టీచింగ్‌ అండ్‌ వర్కర్స్‌ యూనియన్‌ (ఐ.ఎఫ్‌.టి.యు) ఆధ్వర్యంలో జిల్లా విద్యాధికారి (డి.ఈ.ఓ) కి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా యూనియన్‌ రాష్ట్ర నాయకులు ఎం.సుధాకర్‌ మాట్లాడుతూ ఈరోజు నుండి అన్ని పాఠశాలలు, కేజీబీవీలు, మోడల్‌ స్కూళ్లకు పదవతరగతి మినహా …

Read More »

25న మలేరియా అవగాహన ర్యాలీ

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రపంచ మలేరియా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ నెల 25వ తేదీన జిల్లా కేంద్రంలో మలేరియా వ్యాధిపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ర్యాలీ నిర్వహించడం జరుగుతుందని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్‌ సుదర్శనం తెలిపారు. ఉదయం ఎనిమిది గంటలకు పిఓడిటిటి కార్యాలయం నుండి డిఎంహెచ్‌ఓ కార్యాలయం వరకు ర్యాలీ కొనసాగుతుందని వివరించారు.

Read More »

ఎస్‌ఎస్‌సి పరీక్షల ఏర్పాట్లపై 25న సమావేశం

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పదవ తరగతి వార్షిక పరీక్షల ఏర్పాట్ల విషయమై చర్చించేందుకు ఈ నెల 25వ తేదీన కలెక్టరేట్లోని ప్రగతిభవన్లో మధ్యాహ్నం మూడు గంటలకు ఆయా శాఖల జిల్లా అధికారులతో సమావేశం ఏర్పాటు చేయడం జరిగిందని జిల్లా విద్యాశాఖ అధికారి ఎన్‌వీ. దుర్గాప్రసాద్‌ తెలిపారు. ఎస్‌ఎస్‌సి వార్షిక పరీక్షలను సాఫీగా, పకడ్బందీగా నిర్వహించేందుకు చేపట్టాల్సిన చర్యల గురించి సమావేశంలో సూచనలు చేయడం …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »