నిజామాబాద్, ఏప్రిల్ 23
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రపంచ మలేరియా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ నెల 25వ తేదీన జిల్లా కేంద్రంలో మలేరియా వ్యాధిపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ర్యాలీ నిర్వహించడం జరుగుతుందని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ సుదర్శనం తెలిపారు.
ఉదయం ఎనిమిది గంటలకు పిఓడిటిటి కార్యాలయం నుండి డిఎంహెచ్ఓ కార్యాలయం వరకు ర్యాలీ కొనసాగుతుందని వివరించారు.