నిజామాబాద్, ఏప్రిల్ 23
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : పదవ తరగతి వార్షిక పరీక్షల ఏర్పాట్ల విషయమై చర్చించేందుకు ఈ నెల 25వ తేదీన కలెక్టరేట్లోని ప్రగతిభవన్లో మధ్యాహ్నం మూడు గంటలకు ఆయా శాఖల జిల్లా అధికారులతో సమావేశం ఏర్పాటు చేయడం జరిగిందని జిల్లా విద్యాశాఖ అధికారి ఎన్వీ. దుర్గాప్రసాద్ తెలిపారు.
ఎస్ఎస్సి వార్షిక పరీక్షలను సాఫీగా, పకడ్బందీగా నిర్వహించేందుకు చేపట్టాల్సిన చర్యల గురించి సమావేశంలో సూచనలు చేయడం జరుగుతుందని పేర్కొన్నారు. సంబంధిత శాఖల జిల్లా అధికారులు సకాలంలో సమావేశానికి హాజరు కావాలని డీఈఓ కోరారు.