నిజామాబాద్, ఏప్రిల్ 25
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని టీఎన్జీవోల సంఘం ఆధ్వర్యంలో సోమవారం సాయంత్రం సంఘ భవనంలో ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి జిల్లా పరిషత్ చైర్మన్ దాదన్నగారి విట్టల్ రావుతో కలిసి ముఖ్య అతిథిగా హాజరై, మైనార్టీ సోదరులు, ఉద్యోగ సంఘం నాయకులతో కలిసి ఇఫ్తార్ విందులో పాల్గొన్నారు.
ముస్లిం మత పెద్దలు నిర్వహించిన ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొని తెలంగాణతో పాటు నిజామాబాద్ జిల్లా సుభిక్షంగా ఉండాలని, అన్ని వర్గాల ప్రజలు సుఖ సంతోషాలతో విలసిల్లాలని ఆకాంక్షించారు. రంజాన్ ఇఫ్తార్ విందులు మత సామరస్యానికి ప్రతీకగా నిలుస్తాయని, సోదరభావాన్ని పెంపొందిస్తాయని ఈ సందర్భంగా మంత్రి పేర్కొన్నారు.
కార్యక్రమంలో రెడ్ కో చైర్మన్ ఎస్ఎం అలీమ్, టీఎన్జీవోల సంఘం జిల్లా అధ్యక్షుడు అలుక కిషన్, ప్రధాన కార్యదర్శి అమృత్ కుమార్, ఇతర బాధ్యులు, వివిధ శాఖల ఉద్యోగులు, మైనారిటీ నాయకులు పాల్గొన్నారు.