నిజామాబాద్, ఏప్రిల్ 26
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : దేశంలో మొదటి పది ఆదర్శ గ్రామాలు మన తెలంగాణవే! ఈ విషయాన్ని కేంద్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ తన వెబ్ సైట్ లో పేర్కొన్నది. సన్సద్ ఆదర్శ్ గ్రామీణ యోజన పథకం కింద ఎంపికైన గ్రామాల వివరాలను తాజాగా ఆ వెబ్ సైట్‌లో పెట్టారు. అంతేకాదు, దేశంలోని మొదటి 20 ఆదర్శ గ్రామాల్లో 19 గ్రామాలు కూడా మన తెలంగాణవే. ఇది తెలంగాణ వస్తే ఏమొస్తది? అన్నవాళ్ళకు సూటి సమాధానం. రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, పురపాలక, పట్టణాభివృద్ధి శాఖల మంత్రి కల్వకుంట్ల తారక రామారావు ట్వీట్ చేశారు.
ఇదంతా సిఎం కెసిఆర్ మానస పుత్రిక పల్లె ప్రగతి సాధించిన ప్రగతి అన్నారు రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి. ఇప్పటికే స్వచ్ఛ, ఈ పంచాయతీ, ఈ ఆడిటింగ్, బహిరంగ మల విసర్జన రహిత (ఓడిఎఫ్) వంటి అనేక అంశాల్లో జిల్లాలో గ్రామాలు దేశానికే ఆదర్శంగా నిలిచిన విషయం తెలిసిందే. ఒకప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో ఒక్క గంగదేవి పల్లె గ్రామాన్ని దేశానికి ఆదర్శంగా పేర్కొనేవారు. కానీ ఈ రోజు సిఎం కెసిఆర్ పల్లె ప్రగతి కార్యక్రమాన్ని అమలు చేస్తుండగా, గ్రామ పంచాయతీలకు నిధులు, అదనపు వనరులు, హంగులు తోడై, అన్ని రంగాల్లో గ్రామాలు ఆదర్శంగా మారుతున్నాయి. ఇందుకు నిదర్శనమే ఈ ఉత్తమ గ్రామాల ఎంపిక, ప్రశంస.
ఈ సందర్బంగా ఆయా గ్రామాల సర్పంచ్‌లకు, జిల్లా అధికారులకు మంత్రి శుభాకాంక్షలు తెలిపారు.
దేశంలోని టాప్ 10 గ్రామాల్లో నిజామాబాద్ జిల్లాలో నాలుగు
నిజామాబాద్ జిల్లా పల్డా (స్కోర్ ః 90.95)
నిజామాబాద్ జిల్లా నందిపేట మండలం వెల్మల (స్కోర్ ః 90.49)
నిజామాబాద్ జిల్లా తానా కుర్దు (స్కోర్ ః 90.3)
నిజామాబాద్ జిల్లా వేల్పూర్ మండలం కుక్‌నూర్ (స్కోర్ ః 90.28)