డిచ్‌పల్లి, ఏప్రిల్ 26
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయం ఉపకులతీ ఆచార్య డి. రవీందర్ మంగళవారం ఉదయం తన చాంబర్‌లో తెలుగు అధ్యయనశాఖ బిఒఎస్ డా. జి. బాల శ్రీనివాసమూర్తిని ఆత్మీయంగా సత్కరించారు.
డా. జి. బాల శ్రీనివాసమూర్తి రచించిన ‘‘విలక్షణ పీవీ’’ పుస్తకాన్ని ఇటీవల భారత ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్య నాయుడు ఆవిష్కరించిన సందర్భంగా వీసీ ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. రాజనీతిజ్ఞుడు, అపర మేధావి, సౌమ్యులు, భారతదేశ పూర్వ ప్రధాన మంత్రి స్వర్గీయ పివి నరసింహ రావు మీద సమగ్ర వ్యక్తిత్వాన్ని పుస్తకంలో ఆవిష్కరించారని వీసీ మూర్తిని అభినందించారు.
ఆ సందర్భంలో డా. మూర్తి తాను రచించిన విలక్షణ పీవీ పుస్తకం తొలి ప్రతిని ఉపకులపతి ఆచార్య డి. రవీందర్‌కు అందించి ఆశీస్సులు తీసుకున్నారు. వీసీ సత్కరించడం పట్ల పీఆర్‌ఒ డా. వి. త్రివేణి, ఎపిఆర్‌ఓ డా. శ్రీనివాస్ తదితరులు అభినందనలు తెలిపారు.