నిజాంసాగర్, ఏప్రిల్ 29
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజాంసాగర్ మండల కేంద్రంలో దళిత బంధు లబ్ధిదారుల్లో కొంతమందికి యూనిట్లను అందజేయనున్నట్లు టిఆర్‌ఎస్ సీనియర్ నాయకులు దుర్గారెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మే ఒకటో తేదీన శాసనసభ వ్యవహారాలు రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్, రాష్ట్ర అసెంబ్లీ ప్యానల్ స్పీకర్ జుక్కల్ ఎమ్మెల్యే హన్మంత్ షిండే, కామారెడ్డి జిల్లా జడ్పి చైర్ పర్సన్ శోభా, ఉమ్మడి జిల్లా డిసిసిబి చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డిల చేతుల మీదుగా వరి కోత యంత్రాలు, జెసిబి, నాలుగు చక్రాల వాహనాలు అందజేయనున్నట్లు దుర్గారెడ్డి తెలిపారు.
ఇందుకోసం మే 1 తేదీన మధ్యాహ్నం రెండు గంటలకు జరగనున్న కార్యక్రమం విజయవంతం చేయాలన్నారు. కార్యక్రమంలో పిట్లం వ్యవసాయ మార్కెట్ కమిటీ ఉపాధ్యక్షుడు గైని విఠల్, మండల సర్పంచుల ఫోరం అధ్యక్షులు రమేష్ గౌడ్, నాయకులు నారాయణ, గైని రమేష్, చాకలి రమేష్ కుమార్, రాములు, తదితరులు ఉన్నారు.