డిచ్‌పల్లి, ఏప్రిల్ 29
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయంలో శుక్రవారం అర్థశాస్త్ర విభాగంలో జరిగిన ఫీల్ ది న్యూ అరోమా కార్యక్రమానికి ఉపకులపతి ఆచార్య.డి.రవీందర్ ముఖ్య అతిధిగా హాజరై విద్యార్దులనుద్దేశిస్తూ ప్రసంగిస్తూ సామజిక శాస్త్రాలలో అర్థశాస్త్రం ఉన్నతమైనదన్నారు. ఆర్థిక వేత్తలు దేశానికి అభివృద్ధి నమూనా తయారుచేసి దేశాభివృద్ధికి తోడ్పాటునందిస్తున్నారని పేర్కొన్నారు.
కార్యక్రమానికి అతిథిగా బుద్ధా మురళి హాజరై విద్యార్థులు అకడెమిక్ జ్ఞానంతో పాటుగా నిత్యజీవితంలో ఎదురయ్యే సమస్యల పరిష్కారాలను అధ్యనం చేయాలన్నారు. రిజిస్ట్రార్ ఆచార్య కె. శివశంకర్ ప్రసంగిస్తూ అర్థశాస్త్ర విభాగంలో అనేక ఆవిష్కరణలు జరిగాయని వాటిని ఆదర్శంగా తీసుకోని విద్యార్థులు ముందుకుపోవాలని సూచించారు.
కార్యక్రమంలో ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ హారతి, హెడ్. డా. సంపత్, డా. అక్కినపల్లి పున్నయ్య, డా. పాత నాగరాజు, డా.రవీందర్ రెడ్డి, డా. సప్న, డా.శ్రీనివాసులు, డా. దత్త హరి తదితరులు విద్యార్థులనుద్దేశించి మాట్లాడారు. విద్యార్థులు పాతజ్ఞాపకాలను నెమరువేసుకొని భవిష్యత్ తీర్మానాలు చేసుకున్నారు. అనంతరం సాంస్కృతిక కార్యక్రమాలతో సందడి చేశారు.