కామారెడ్డి, ఏప్రిల్ 29
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ, షెడ్యూల్డ్ తెగల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో కామారెడ్డి జిల్లాలోని ఎస్సీ, ఎస్టీ నిరుద్యోగ ఉద్యోగార్థులకు ఉచిత గ్రూప్స్ శిక్షణ తరగతులు శుక్రవారం జిల్లా కలెక్టర్, మేజిస్ట్రేట్ జితేష్ వి పాటిల్ స్థానిక ప్రభుత్వ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో ప్రారంభించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం వెలువరిస్తున్న ఉద్యోగ ప్రకటనలకు నిరుద్యోగులకు పూర్తిస్థాయిలో సంసిద్ధులు కావడానికి అవసరమైన ఉచిత శిక్షణ సదుపాయాన్ని సద్వినియోగం చేసుకొని శిక్షణలో భాగంగా వివిధ పాఠ్యాంశాలకు సంబంధించి విషయ నిపుణులు ఇచ్చే శిక్షణతో పాటు మెళుకువలు నేర్చుకొని ఉద్యోగ ప్రయత్నంలో అందరూ విజయం సాధించాలని, అందుకోసం తగినంత కృషి చేయాల్సిందిగా శిక్షణకు హాజరైన ఉద్యోగార్థులకు సూచించారు.
కార్యక్రమంలో జిల్లా షెడ్యూల్ కులాల అభివృద్ధి అధికారి రజిత, జిల్లా షెడ్యూల్ తెగల అభివృద్ధి అధికారి అంబాజీ, కళాశాల ఇంచార్జ్ ప్రిన్సిపల్ చంద్రకాంత్, అర్థశాస్త్ర నిపుణులు పోతన, సంక్షేమ శాఖల అధికారులు పాల్గొన్నారు.