భారతదేశ ఫార్మా ఉత్పత్తులు అత్యంత ప్రాముఖ్యత పొందాయి

డిచ్‌పల్లి, ఏప్రిల్‌ 30

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని ఆర్గానిక్‌ కెమిస్ట్రీ విభాగం ఆధ్వర్యంలో ‘‘ఇండియన్‌ ఫార్మా విజన్‌: ఇన్నోవేషన్స్‌ అండ్‌ ఇంపాక్ట్స్‌’’ అనే అంశంపై న్యాయ కాళాశాలలోని సమావేశ మందిరంలో శనివారం గెస్ట్‌ లెక్చర్‌ ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఉపకులపతి ఆచార్య డి. రవీందర్‌ విచ్చేసి మాట్లాడారు. భారతదేశ ఫార్మా ఉత్పత్తులు అత్యంత ప్రాముఖ్యత పొందాయని అన్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఎదురవుతున్న విపత్కర పరిస్థితులను భారతీయ ఔషదాలు సాధించాయన్నారు. కోవిద్‌ తదనంతర కాలంలో డ్రగ్స్‌ తయారికి భారత ఫార్మా శాస్త్రవేత్తల పాత్ర అధికంగా ఉంటుందన్నారు.

కార్యక్రమంలో ప్రధాన వక్తగా హైదరాబాద్‌ నుంచి సిఎస్‌ఐఆర్‌ – ఇండియన్‌ ఇన్సిట్యూట్‌ ఆర్గానిక్‌ ఆఫ్‌ కెమికల్‌ టెక్నాలజీ సీనియర్‌ ప్రిన్సిపల్‌ సైంటిస్ట్‌ అండ్‌ ప్రొఫెసర్‌ డా. లింగయ్య నాగారపు విచ్చేసి ప్రసంగించారు. తాను బిక్నూర్‌లో కెమిస్ట్రీ చదువుకొని సిఎస్‌ఐఆర్‌ సాధించానని అన్నారు. తాను చేసిన ఈ ప్రసంగం గొప్ప శాస్త్రవేత్త స్టాన్‌ ఫర్డ్‌ యూనివర్సిటీ సర్వేలో వెల్లడిరచిన శాస్త్రవేత్తల జాబితాలో ఒకరైన ఉపకులపతి ఆచార్య డి. రవీందర్‌కి అంకితం చేస్తున్నట్లుగా పేర్కొన్నారు.

భారతదేశంలో ఫార్మా ఉత్పత్తుల కోసం జరుగుతున్న గొప్ప పరిశోధనలు, నూతన అవిష్కరణలను గూర్చి తెలిపారు. ఫార్మా విజన్‌ ఎలా ఉంటుందో వివరించారు. వివిధ డిసీసెస్‌, వైరస్‌ లపై వాటి ప్రభావాన్ని వెల్లడిరచారు. ప్రపంచంలోనే ఫార్మా కంపెనీలు అత్యుత్తమ సేవలు అందిస్తున్నాయని అన్నారు. భారత స్వాతంత్య్రాంతరం 21 డ్రగ్స్‌ ను భారతదేశం ఉత్పత్తి చేసిందన్నారు. అందులో సిఎస్‌ఐఆర్‌ సంస్థ 14 డ్రగ్స్‌ను రూపొందించిందని అన్నారు.

ఒక డ్రగ్‌ మార్కెట్‌లోకి రావడానికి దాదాపు 70 సంవత్సరాల కాలవ్యవధి పడుతుందన్నారు. భారతీయ ఫార్మా కంపెనీల చరిత్ర, వాటి ఉత్పత్తులను గూర్చి సవివరంగా తెలిపారు. ముఖ్యంగా క్యాన్సర్‌ చికిత్సలో అవసరమైన ఫార్మా మెడిసిన్స్‌ను తయారు చేస్తున్నారని అన్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచనల మేరకు ప్రస్తుతం క్యాన్సర్‌ చికిత్స కోసం ఎటువంటి మందులను కనుక్కుంటున్నారో తెలిపారు.

కీమో థెరఫీ, రేడియో థెరఫీ, హార్మోన్‌ థెరఫీ వంటి చికిత్సల్లో వాడే డ్రగ్స్‌ తయారీలో నూతన ఆవిష్కరణలను వివరించారు. అనాది కాలంగా ఆయుర్వేద మందుల ప్రభావాన్ని గూర్చి వివరించారు. ‘‘గరుడయోధ’’ వంటి మందులు అచిరకాలంగా అనేక రోగాల చికిత్సలో ఏ విధంగా తోడ్పాటును అందిస్తున్నాయో తెలిపారు. కార్యక్రమంలో విభాగాధిపతి డా. బాలకిషన్‌, బిఒఎస్‌ డా. సాయిలు, అధ్యాపకులు డా. నాగేశ్వర రావు, డా. రాజేశ్వరి, డా. గంగాకిషన్‌, డా. సురేష్‌, డా. డేనియల్‌ తదితర అధ్యాపకులు, పరిశోధకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Check Also

నేటి పంచాంగం

Print 🖨 PDF 📄 eBook 📱 శనివారం, నవంబరు 23, 2024శ్రీ క్రోధి నామ సంవత్సరందక్షిణాయణం – శరదృతువుకార్తీక …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »