కామారెడ్డి, ఏప్రిల్ 30
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : హరిత హారంలో మొక్కలు నాటడానికి గ్రామాల్లోని చెరువు కట్టలు, కాలువల గట్ల స్థలాలను ఎంపిక చేయాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. సమీకృత జిల్లా కార్యాలయం సముదాయంలో శనివారం మండల స్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లా కలెక్టర్ మాట్లాడారు.
ఇరిగేషన్, ఉపాధి హామీ అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. గ్రామాల వారిగా హరిత హారంలో మొక్కలు నాటడానికి ఉపాధిహామీ కూలీలతో గుంతలు తీయించాలని పేర్కొన్నారు. ఇరిగేషన్ అధికారులు చెరువు కట్టను పరిశీలించి, ఖాళీ స్థలాలను గుర్తించాలని చెప్పారు. వీడియో కాన్ఫరెన్స్‌లో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ వెంకటేష్ దోత్రే, ఇన్చార్జి డీపీవో సాయిబాబా, ఉపాధి హామీ ఏపీడి శ్రీకాంత్, ఇరిగేషన్ అధికారులు పాల్గొన్నారు.