కామారెడ్డి, ఏప్రిల్ 12 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : గాంధారి లో నిర్మిస్తున్న ఆయుష్ వెల్ నెస్ సెంటర్ ను వారం రోజుల్లో పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అధికారులను ఆదేశించారు. మంగళవారం గాంధారీ కమ్మ్యూనీటి హెల్త్ సెంటర్ సమీపంలో పైలట్ ప్రాజెక్టుగా నిర్మిస్తున్న ఆయుష్ వెల్ నెస్ సెంటర్ నిర్మాణ పనులను జిల్లా కలెక్టర్ క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. ఆయుష్ వెల్ నెస్ …
Read More »Monthly Archives: April 2022
కల్కి భగవాన్ ఆలయంలో అన్నదానం..
కామారెడ్డి, ఏప్రిల్ 12 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని కల్కి భగవాన్ ఆలయంలో మంగళవారం సందర్భంగా అన్నదాన కార్యక్రమము జరిగింది. అన్నదాన కార్యక్రమానికి ఆన్నదాతలుగా ప్రకాష్ మౌనిక, ఉప్పల అంతయ్య నాగమణి దంపతులు, గజవాడ నాగరాజు, గజవాడ అరవింద్ సహాయం చేశారు. వీరికి ఆలయ భక్తబృందం ఆధ్వర్యంలో సన్మానించారు. ప్రతి మంగళవారం అన్నదానానికి ముందుకు వచ్చేవారు ఆలయంలో సంప్రదించాలని కోరారు. కార్యక్రమంలో ఆలయ సేవకులు …
Read More »రెడ్ క్రాస్ సభ్యుడికి ఘన నివాళి
దోమకొండ, ఏప్రిల్ 12 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బీబీపేట్ మండల కేంద్రానికి చెందిన ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ జీవితకాల సభ్యుడు డాక్టర్ హన్మయ్య పరమపదించి నేటికీ సంవత్సరం అయిన తరుణంలో ప్రథమ వర్ధంతి కార్యక్రమంలో పాల్గొని మండలంలోని ప్రజలకు వైద్యుడిగా అయన చేసిన సేవలు కొనియాడి నివాళులు అర్పించారు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా వైస్ చైర్మన్ అంకన్నగారి నాగరాజ్ గౌడ్, మండల టీఆర్‌ఎస్ …
Read More »12 సంవత్సరాల పైన వారు కరోనా వ్యాక్సిన్ వేయించుకోవాలి
కామారెడ్డి, ఏప్రిల్ 12 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బిజెవైఎం రాష్ట్ర శాఖ పిలుపు మంగళవారం బీజేవైఎం కామారెడ్డి ఆధ్వర్యంలో పట్టణంలోని పలు పాఠశాలలు సందర్శన చేసి విద్యార్థులకు కరోనా వ్యాక్సిన్ అవగాహనా ఇస్తూ, వ్యాక్సిన్ తీసుకొని వారు తీసుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా బిజెవైఎం కేంద్ర ప్రభుత్వ పథకాల ప్రచార కమిటీ బాధ్యుడు నరేందర్ రెడ్డి మాట్లాడుతూ ప్రపంచం మొత్తం కరోనా కారణంగా అన్ని రకాలుగా ఇబ్బంది …
Read More »మన ఊరు-మన బడి పనులను వెంటనే ప్రారంభించాలి
నిజామాబాద్, ఏప్రిల్ 12 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మన ఊరు మన బడి కార్యక్రమం కింద ఇప్పటికే అనుమతి తెలిపిన పనులను తక్షణమే ప్రారంభించాలని కలెక్టర్ సి నారాయణ రెడ్డి ఆదేశించారు. పనులు వెంటనే ప్రారంభమయ్యేలా చూడాల్సిన బాధ్యత ప్రత్యేక అధికారులదే అని స్పష్టం చేశారు. మంగళవారం సాయంత్రం స్థానిక ప్రగతి భవన్‌లో నోడల్ అధికారులు, ఆయా శాఖలకు చెందిన ఏఈలు, డీఈలు, విద్యాశాఖ అధికారులతో కలెక్టర్ …
Read More »పర్యావరణ సమస్య ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది
డిచ్‌పల్లి, ఏప్రిల్ 12 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని అనువర్తిత ఆర్థిక శాస్త్ర విభాగంలో విభాగాధిపతి టి. సంపత్ ఆధ్వర్యంలో మంగళవారం గెస్ట్ లెక్చర్ ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి ప్రధాన వక్తగా పాండిచ్చెరి నుంచి నేషనల్ ఇన్సిట్యూషన్ ఆఫ్ టెక్నాలజీ పుదుచ్చెరి అసిస్టెంట్ ప్రొఫెసర్ డా. రాగుట్ల చంద్రశేఖర్ విచ్చేసి ‘‘ఫైనాన్షియల్ క్లీన్ ఎనెర్జీ ప్రాజెక్ట్స్: ఎవిడెన్స్ ఫ్రం మేజర్ ఇన్వెస్ట్ మెంట్ కంట్రీస్’’ అనే …
Read More »జిల్లా ఆసుపత్రిని సందర్శించిన టీఎస్‌ఎంఎస్‌ఐడీసీ చైర్మన్
నిజామాబాద్, ఏప్రిల్ 12 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ రాష్ట్ర వైద్య సేవలు, మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ మంగళవారం జిల్లా ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిని సందర్శించారు. ఆ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ చంద్రశేఖర్, జిల్లా కలెక్టర్ సి.నారాయణరెడ్డిలతో కలిసి ఆసుపత్రిలోని వివిధ విభాగాలను పరిశీలించారు. రోగులకు అందుతున్న వైద్య సేవల గురించి, మందుల స్టాక్ వివరాలను సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. …
Read More »బీడీ కార్మికుల వేతనాలు చెల్లించాలి…
నిజామాబాద్, ఏప్రిల్ 12 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : గత 15 రోజులుగా బీడీ కార్మికులకు పని లేకుండా చేసిన కిషన్ లాల్ రామ్ స్వరూప్ బీడీ ఫ్యాక్టరీ ముందు కార్మికులు పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించి మేనేజర్‌కి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షులు రాజేశ్వర్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం వెంకన్న మాట్లాడుతూ కార్మికులకు కార్మిక …
Read More »విజ్ఞానసౌధను సందర్శించిన వీసీ
డిచ్‌పల్లి, ఏప్రిల్ 12 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని సెంట్రల్ లైబ్రెరీ (విజ్ఞాన సౌధ) ను ఉపకులపతి ఆచార్య డి. రవీందర్ మంగళవారం సందర్శించారు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన ప్రభుత్వ ఉద్యోగాల ప్రకటన నేపథ్యంలో ప్రిపేర్ అవుతున్న సందర్భంలో విద్యార్థులను వీసీ పలకరించారు. విద్యార్థులందరు రాష్ట్ర ప్రభుత్వం వెలువరుస్తున్న ఉద్యోగాల సాధన కోసం కృషి చేయాలన్నారు. తాము అనుకున్న లక్ష్యాలను అధిగమించాలని అన్నారు. …
Read More »కొనసాగుతున్న ఎన్‌ఎస్‌ఎస్ స్పెషల్ క్యాంప్
డిచ్‌పల్లి, ఏప్రిల్ 12 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని జాతీయ సేవా పథకం (ఎన్‌ఎస్‌ఎస్) యూనిట్ – 2 ప్రోగ్రాం ఆఫీసర్ డా. మహేందర్ రెడ్డి అయిలేని ఆధ్వర్యంలో సుద్దపల్లి గ్రామంలో మంగళవారం కూడా ఎన్‌ఎస్‌ఎస్ స్పెషల్ క్యాంప్ కొనసాగింది. రెండవ రోజు వాలంటీరులందరు గ్రామంలో ‘‘బేటీ బచావో – బేటీ పడావో’’ అనే అంశంపై ర్యాలి నిర్వహించి అవగాహన కల్పించారు. వీదుల్లో తిరుగుతూ ప్లకార్డులు …
Read More »