నిజామాబాద్, ఏప్రిల్ 10 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం ప్రతి సోమవారం కలెక్టరేట్లోని ప్రగతి భవన్‌లో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని తాత్కాలికంగా వాయిదా వేయడం జరిగిందని కలెక్టర్ సి.నారాయణరెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 11న సోమవారం రోజున మహాత్మా జ్యోతిబా పూలే జయంతి ఉత్సవాలను జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సందర్భంగా ప్రజావాణి కార్యక్రమాన్ని తాత్కాలికంగా వాయిదా …
Read More »Monthly Archives: April 2022
జిల్లా ప్రజలకు శ్రీరామ నవమి శుభాకాంక్షలు
నిజామాబాద్, ఏప్రిల్ 10 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : శ్రీరామ నవమి వేడుకను పురస్కరించుకుని, తెలంగాణ రాష్ట్ర శాసన సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి, రాష్ట్ర రోడ్లు-భవనాలు, గృహ నిర్మాణ, శాసన సభా వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, జిల్లా కలెక్టర్ సి.నారాయణ రెడ్డి తదితరులు జిల్లా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. భక్తి శ్రద్ధలతో శ్రీరామ నవమి ఉత్సవాలు జరుపుకోవాలని ఆకాంక్షించారు.
Read More »రోడ్డు ప్రమాదంలో లెక్చరర్ మృతి
కామారెడ్డి, ఏప్రిల్ 9 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి పట్టణ శివారులోని సిరిసిల్ల రోడ్‌లో ఆర్టీసీ బస్, బైక్ ఢీ కొన్నాయి. ఈ సంఘటనలో బైక్ పై ప్రయాణిస్తున్న వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతిచెందిన వ్యక్తి రామారెడ్డి మండలం అన్నారం గ్రామానికి చెందిన సంతోష్ రెడ్డి (45) గా గుర్తించారు. ఈ మేరకు కామారెడ్డి పట్టణ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కామారెడ్డి …
Read More »ఉచిత కంటి ఆపరేషన్లు
కామారెడ్డి, ఏప్రిల్ 9 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కీర్తిశేషులు సానెబోయిన నర్సవ్వ – బాల్ కిషన్ ముదిరాజ్ కామారెడ్డి జ్ఞాపకార్థము వారి కుమారుల సహాకారంతో వి.టి. ఠాకూర్ లయన్స్ కంటి హాస్పిటల్ కామారెడ్డి అధ్వర్యంలో ఉచితంగా కంటి పరిక్ష క్యాంపు నిర్వహించారు. ఇట్టి క్యాంపునకు కామారెడ్డి పరిసర ప్రాంతాల నుండి వచ్చి పరీక్షలు చేసుకుని అవసరమైన మందులు, కంటి అద్దాలు తీసుకున్నారు. కంటి ఆపరేషన్ అవసరం ఉన్న …
Read More »తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ నూతన కమిటీ
నిజామాబాద్, ఏప్రిల్ 9 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ (ఐ.ఎఫ్.టీ.యూ) 15వ జిల్లా మహాసభ శుక్రవారం నిజామాబాద్ జిల్లా, ఎడపల్లి మండలం, జానకం పేట్‌లో నిర్వహించారు. ఈ నేపథ్యంలో యూనియన్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో శ్రామిక భవన్, కోటగల్లిలో ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా యూనియన్ జిల్లా అధ్యక్షులు డి.రాజేశ్వర్, ప్రధాన కార్యదర్శి ఎం.వెంకన్న మాట్లాడుతూ శుక్రవారం జరిగిన మహాసభలో …
Read More »11న కామారెడ్డిలో జ్యోతిబాఫూలే జయంతి వేడుకలు
కామారెడ్డి, ఏప్రిల్ 9 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఈ నెల 11 వ తేదీన మహాత్మా జ్యోతీబాపూలే 196వ జయంతి వేడకలు అధికారికంగా నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ తెలిపారు. జయంతి వేడుకలు కామారెడ్డి మున్సిపల్ కార్యాలయం ఆవరణలో ఉదయం 10 గంటలకు ప్రభుత్వ విప్, శాసన సభ్యులు కామారెడ్డి గంప గోవర్ధన్ అధ్యక్షతన నిర్వహించనున్నట్లు తెలిపారు. జిల్లా పరిషత్ ఛైర్మన్, పార్లమెంటు సభ్యులు, …
Read More »ప్రజాపంథా పార్టీ నిజామాబాద్ డివిజన్ కార్యదర్శిగా వెంకన్న
నిజామాబాద్, ఏప్రిల్ 9 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : సీపీఐ (ఎం.ఎల్) ప్రజాపంథా పార్టీ నిజామాబాద్ డివిజన్ నిర్మాణ జనరల్ బాడీ సమావేశం ఎన్.ఆర్ భవన్, కోటగల్లిలో జరిగింది. సమావేశంలో డివిజన్ కమిటీ కార్యదర్శిగా ఎం.వెంకన్నను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా పార్టీ డివిజన్ కార్యదర్శిగా ఎన్నికైన ఎం.వెంకన్న మాట్లాడుతూ…నిజామాబాద్ డివిజన్ పరిధిలో ప్రజా సమస్యల పరిష్కారం కోసం, ప్రజా ఉద్యమాలను బలోపేతం చేయడం కోసం బాధ్యతగా పని …
Read More »సిఎం సహాయనిధి చెక్కుల పంపిణీ
కామారెడ్డి, ఏప్రిల్ 9 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి నియోజకవర్గంలోని 19 మందికి ముఖ్యమంత్రి సహయనిధి నుండి మంజూరైన 4 లక్షల 86 వేల రూపాయల చెక్కులను ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెండవ సారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నియోజకవర్గంలో ఇప్పటివరకు 1,211 మందికి 7 కోట్ల 69 లక్షల 82 వేల 300 రూపాయల …
Read More »పీడీఎస్ బియ్యం పట్టివేత
కామారెడ్డి, ఏప్రిల్ 9 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : గత కొన్ని సంవత్సరాలుగా అక్రమంగా పీడీఎస్ బియ్యం వ్యాపారం చేస్తున్న వ్యాపారస్తుడిని శనివారం కామారెడ్డి సిసిఎస్ పోలీసులు నమ్మదగిన సమాచారం మేరకు పంచముఖి హనుమాన్ మందిర పరిసర ప్రాంతంలో పట్టుకొని కామారెడ్డి పట్టణ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం రామారెడ్డి మండలం ఉప్పలపాడు గ్రామానికి చెందిన పబ్బ సాయి కుమార్ అలియాస్ చింటూ అక్రమంగా …
Read More »ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి
నిజామాబాద్, ఏప్రిల్ 8 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : వివిధ శాఖలలో ఖాళీలను భర్తీ చేసేందుకు ప్రభుత్వం పెద్ద ఎత్తున ఉద్యోగ నోటిఫికేషన్‌లను విడుదల చేయనున్న నేపథ్యంలో ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ప్రభుత్వం తరపున సంబంధిత శాఖల ఆధ్వర్యంలో అందజేయనున్న ఉచిత శిక్షణను అర్హులైన ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ సి.నారాయణరెడ్డి సూచించారు. ఎంపికైన వారికి ఎస్సీ, ఎస్టీ స్టడీ సర్కిల్స్ ఆధ్వర్యంలో ముందస్తుగా నాణ్యమైన …
Read More »