Monthly Archives: April 2022

టియు విద్యార్థులకు ఐటి హబ్‌లో మెరుగైన అవకాశాలు

డిచ్‌పల్లి, ఏప్రిల్‌ 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ నగరంలో ఐటి హబ్‌ ఏర్పాటు చేస్తుండడంతో అర్బన్‌ ఎమెల్యే గణేష్‌ బిగాల, సోదరులు మహేష్‌ బిగాల నేతృత్వంలో శుక్రవారం వివిధ రంగాలకు చెందిన ప్రముఖ వ్యక్తులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. సమావేశానికి తెలంగాణ విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య డి. రవీందర్‌ హాజరయ్యారు. అమెరికాకు చెందిన వైటల్‌ గ్లోబల్‌ కంపెనీ మేనేజింగ్‌ డైరెక్టర్‌ ప్రవీణ్‌ కుమార్‌ నిజామాబాద్‌లో ఐటి …

Read More »

ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన కలెక్టర్‌

రెంజల్‌, ఏప్రిల్‌ 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రెంజల్‌ మండలం దండిగుట్ట గ్రామంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని శుక్రవారం కలెక్టర్‌ సి.నారాయణ రెడ్డి పరిశీలించారు. కొనుగోలు కేంద్రం ఆవరణలో రైతులు ఆరబెట్టిన ధాన్యాన్ని పరిశీలించి పలు సూచనలు చేశారు. బాగా ఆరబెట్టి శుభ్రపరిచిన ధాన్యాన్ని కేంద్రాలకు తెచ్చి పూర్తిస్థాయి మద్దతు ధర పొందాలని రైతులకు సూచించారు. కాగా, ప్రతిరోజు ఎంత పరిమాణంలో వరి ధాన్యం …

Read More »

పీఎం కిసాన్‌ లబ్ధిదారులకు రుణాల పంపిణీకి ఏర్పాట్లు

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రధానమంత్రి కిసాన్‌ లబ్ధిదారులందరికీ రుణ సదుపాయం కల్పించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేపడుతున్నామని కలెక్టర్‌ సి.నారాయణ రెడ్డి తెలిపారు. ఇందులో భాగంగానే ఈ నెల 24 నుండి మే 1వ తేదీ వరకు ‘కిసాన్‌ భాగిదారి – ప్రాథమిక్తా హమారీ’ పేరిట ప్రత్యేక కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందన్నారు. లబ్దిదారులకు రుణ పంపిణీ ఏర్పాట్లపై కలెక్టర్‌ శుక్రవారం సంబంధిత అధికారులతో చర్చించారు. …

Read More »

ఉచిత వైద్య సేవలు సద్వినియోగం చేసుకోవాలి

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రభుత్వం తరఫున అందిస్తున్న ఉచిత వైద్య సేవలను సద్వినియోగం చేసుకోవాలని జడ్పీ చైర్మన్‌ దాదన్నగారి విట్టల్‌ రావు, కలెక్టర్‌ సి.నారాయణ రెడ్డి జిల్లా ప్రజలకు పిలుపునిచ్చారు. ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌లో భాగంగా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం రెంజల్‌ మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఆరోగ్య మేళా నిర్వహించారు. జిల్లా పరిషత్‌ చైర్మన్‌ …

Read More »

‘‘విలక్షణ పివి’’ ఆవిష్కరించిన ఉపరాష్ట్రపతి

డిచ్‌పల్లి, ఏప్రిల్‌ 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని తెలుగు అధ్యయనశాఖ అసోసియేట్‌ ప్రొఫెసర్‌, ప్రముఖ పరిశోధకులు డా. గుమ్మన్నగారి బాలశ్రీనివాస మూర్తి మాజీ ప్రధాన మంత్రి, ప్రముఖ రాజకీయ కోవిదులు, బహుముఖ ప్రజ్ఞాశాలి పివి నరసింహారావు జీవితంపై రచించిన ‘‘విలక్షణ పివి’’ అనే పుస్తకాన్ని ఉప రాష్ట్రపతి ఎం. వెంకయనాయుడు హైదరాబాద్‌లో గల జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో శుక్రవారం ఆవిష్కరించారు. రచయితను అభినందించారు. ఉపరాష్ట్రపతి …

Read More »

పుట్టిన బిడ్డకు ముర్రుపాలు తప్పనిసరిగా తాగించాలి

బాన్సువాడ, ఏప్రిల్‌ 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పుట్టిన బిడ్డకు తప్పనిసరిగా ముర్రుపాలు తాగించాలని రాష్ట్ర శాసన సభ పతి పోచారం శ్రీనివాస్‌ రెడ్డి అన్నారు. బాన్సువాడ ప్రభుత్వ జూనియర్‌ కళాశాల ఆవరణలో శుక్రవారం జిల్లా వైద్య శాఖ ఆధ్వర్యంలో ఆజాద్‌ కా అమృత్‌ మహోత్సవంలో భాగంగా మెగా వైద్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా స్పీకర్‌ మాట్లాడారు. తల్లిపాలు బిడ్డకు …

Read More »

మాస్‌ కమ్యూనికేషన్‌లో శ్రీశైలంకు డాక్టరేట్‌

డిచ్‌పల్లి, ఏప్రిల్‌ 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని మాస్‌ కమ్యూనికేషన్‌ విభాగంలోని పరిశోధక విద్యార్థి గాలిపల్లి శ్రీశైలంకు పిహెచ్‌. డి. డాక్టరేట్‌ పట్టా ప్రదానం చేయబడిరది. ఆయన రూపొందించిన సిద్ధాంత గ్రంథం మీద తెలంగాణ విశ్వవిద్యాలయంలోని ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌ కళాశాల మినీ సెమినార్‌ హాల్‌లో శుక్రవారం ఓపెన్‌ వైవా వోస్‌ (మౌఖిక పరీక్ష) నిర్వహింపబడిరది. మాస్‌ కమ్యూనికేషన్‌లో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌గా పని చేసి, …

Read More »

బలమైన ప్రజా ఉద్యమాలు నిర్మిస్తాం

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామ్రేడ్‌ లెనిన్‌ 153 వ జయంతి, సి.పి.ఐ (ఎం.ఎల్‌) 53వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సీపీఐ (ఎం.ఎల్‌) ప్రజాపంథా నిజామాబాద్‌ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఎన్‌.ఆర్‌ భవన్‌, కోటగల్లిలో జెండా ఆవిష్కరణ, కామ్రేడ్‌ విప్లవ నివాళులు అర్పించారు. ముందుగా పార్టీ జిల్లా కార్యదర్శి (ఇంచార్జి) వనమాల కృష్ణ ఎర్రజెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వనమాల కృష్ణ మాట్లాడుతూ పార్లమెంటరీ …

Read More »

నిజామాబాద్‌లో కళాశాల ఆకస్మిక తనిఖీ

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య డి. రవీందర్‌ ఆదేశానుసారం ఆడిట్‌ సెల్‌ డైరెక్టర్‌ డా. బి. విద్యావర్ధిని, జాయింట్‌ డైరెక్టర్‌ డా. బాలకిషన్‌ గురువారం ఉదయం ఎస్‌ఎస్‌ఆర్‌ డిగ్రీ, పీజీ కళాశాలలపై ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా డైరెక్టర్‌ మాట్లాడుతూ ఎస్‌ఎస్‌ఆర్‌ కళాశాలలపై అనేక ఫిర్యాదులు వెల్లువెత్తడం వల్ల వీసీ ఆకస్మిక తనిఖీ నిర్వహించవలసిందిగా ఆదేశించారని అన్నారు. …

Read More »

టీయూలో ప్రపంచ సృజనాత్మకత, నూతన ఆవిష్కరణల దినోత్సవం

డిచ్‌పల్లి, ఏప్రిల్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని ఇంటర్‌ ప్రిన్యూర్‌ షిప్‌ డెవలప్‌ మెంట్‌ సెల్‌ మరియు బిజినెస్‌ మేనేజ్‌ మెంట్‌ విభాగం సంయుక్త ఆధ్వర్యంలో ‘‘ప్రపంచ సృజనాత్మకత, నూతన ఆవిష్కరణల దినోత్సవం’’ ను గురువారం ఉదయం ఘనంగా నిర్వహించారు. అవగాహనా సదస్సును ఇంటర్‌ ప్రిన్యూర్‌ షిప్‌ డెవలప్‌ మెంట్‌ సెల్‌ డైరెక్టర్‌ డా. బి. నందిని, బిజినెస్‌ మెంట్‌ విజాగాధిపతి డా. కె. …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »