నిజామాబాద్, ఏప్రిల్ 20 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రభుత్వ ఆదేశాల మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో కంటిచూపు సమస్యలతో బాధపడుతున్న వారికి ఉచితంగా క్యాటరాక్ట్ ఆపరేషన్లు, మోకాలి నొప్పులతో ఇబ్బందిపడుతున్న వారికి శస్త్ర చికిత్సలు నిర్వహించడం జరుగుతుందని నిజామాబాద్ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ప్రతిమారాజ్ తెలిపారు. ఆపరేషన్లు అవసరమైన వారిని గుర్తించేందుకు వీలుగా జిల్లా జనరల్ ఆసుపత్రి ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా …
Read More »Monthly Archives: April 2022
రాష్ట్రమంతటా కోచింగ్ సెంటర్లు
డిచ్‌పల్లి, ఏప్రిల్ 20 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి ఆధ్వర్యంలో బుధవారం మధ్యాహ్నం వర్చువల్ వేదికగా ఆన్ లైన్‌లో తెలంగాణ రాష్ట్రంలోని ఆరు విశ్వవిద్యాలయాలలో ప్రత్యేకంగా పోటీ పరీక్షల విభాగాలను ప్రారంభించారు. ఉస్మానియా, కాకతీయ, తెలంగాణ, మహాత్మాగాంధీ, శాతవాహన, పాలమూరు విశ్వవిద్యాలయాలలో కోచింగ్ సెంటర్స్ ప్రారంభించారు. కార్యక్రమంలో తెలంగాణ విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య డి. రవీందర్, రిజిస్ట్రార్ ఆచార్య కె. శివశంకర్, …
Read More »చెక్ డ్యాం పనులు పరిశీలించిన డిసిసిబి ఛైర్మన్
బాన్సువాడ, ఏప్రిల్ 20 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బాన్సువాడ పట్టణ (చింతల్ నాగారం) శివారులో నూతనంగా 14 కోట్లతో నిర్మిస్తున్న చెక్ డ్యాం పనులను బుధవారం స్థానిక నాయకులు ప్రజా ప్రతినిదులతో కలిసి ఉమ్మడి నిజామాబాద్ జిల్లా డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ చెక్ డ్యాం నిర్మాణ అనుమతులు మంజూరు చేసిన ముఖ్యమంత్రి కెసీఆర్‌కి, తెలంగాణ రాష్ట్ర …
Read More »అగ్నిమాపక శాఖ సేవలు అభినందనీయం
నిజామాబాద్, ఏప్రిల్ 20 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రమాద ఘటనలు చోటు చేసుకున్న సందర్భాలలో అగ్నిమాపక శాఖ అందిస్తున్న సేవలు ఎంతో ప్రశంసాపూర్వకంగా ఉంటున్నాయని కలెక్టర్ సి.నారాయణరెడ్డి అభినందించారు. ముందు ముందు కూడా ఇదే తరహా స్ఫూర్తిని కనబరుస్తూ ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించాలని సూచించారు. ఈ నెల 14వ తేదీ నుండి ప్రారంభమైన అగ్నిమాపక వారోత్సవాలు బుధవారం ముగిసాయి. జిల్లా కేంద్రంలోని ఫైర్ స్టేషన్ …
Read More »తెరాస పాలనలో మహిళలకు రక్షణ కరవు
కామారెడ్డి, ఏప్రిల్ 20 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ చేస్తున్న ప్రజా సంగ్రామ యాత్రకి వస్తున్న అనూహ్య స్పందన చూసి ఓర్వలేక దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని, ఖమ్మం బీజేపీ కార్యకర్త సాయి గణేష్ ఆత్మహత్యకు కారకులైన వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని, రామాయంపేట తల్లి కొడుకుల ఆత్మ హత్యకు కారకులైన వారిపై చర్యలు తీసుకోవాలని భారతీయ జనతా పార్టీ …
Read More »అగ్ని ప్రమాదాలు జరగకుండా అప్రమత్తంగా ఉండాలి
కామారెడ్డి, ఏప్రిల్ 20 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : అగ్ని ప్రమాదాలు జరగకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి పట్టణంలోని అగ్నిమాపక కార్యాలయంలో అగ్నిమాపక వారోత్సవాల సందర్భంగా సమావేశానికి జిల్లా కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. అగ్నిమాపక శాఖ అధికారులు వరదలు, రోడ్డు ప్రమాదాలు, అగ్ని ప్రమాదాల వంటి ప్రకృతి వైపరీత్యాల సమయంలో ప్రజలకు సేవ చేయడానికి ముందుంటారని …
Read More »25న ఎమ్మెల్యేల ఇళ్ల ముట్టడి
నిజామాబాద్, ఏప్రిల్ 20 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రజా సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సీపీఐ (ఎం.ఎల్) ప్రజాపంథా రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టబోయే ఎమ్మెల్యేల ఇళ్ల ముట్టడి కార్యక్రమాన్ని జిల్లాలో జయప్రదం చేయాలని నగర కార్యదర్శి ఎం. సుధాకర్ అన్నారు. బుధవారం శ్రామిక భవన్, కోటగల్లిలో పార్టీ నగర కమిటీ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సుధాకర్ మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం 2014 నుండి …
Read More »వడదెబ్బ జాగ్రత్తలు – కరపత్రాల ఆవిష్కరణ
నిజామాబాద్, ఏప్రిల్ 19 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : వడదెబ్బ జాగ్రత్తలు అవగాహన తదితర అంశాలపై ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నిజామాబాద్ మరియు ఇందూర్ మదర్ హుడ్ హాస్పిటల్ సంయుక్త ఆధ్వర్యంలో ప్రజలను అప్రమత్తం చేయడానికి పలు సూచనలు సలహాలు అవగాహన కరపత్రాలు జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డిచే విడుదల చేయించారు. ఈ సందర్భంగా అవగాహన కార్యక్రమాలు చేయడం రెడ్ క్రాస్ సొసైటీ అభినందనీయమని అన్నారు. అదేవిధంగా …
Read More »జిల్లా హెల్త్ ప్రొఫైల్ అప్ డేట్ చేయించాలి
నిజామాబాద్, ఏప్రిల్ 19 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కరోనా సంక్షోభం కారణంగా గడిచిన రెండు సంవత్సరాల నుండి పూర్తిగా కోవిడ్ నివారణ కార్యక్రమాలు, వ్యాక్సినేషన్ పైనే దృష్టిని కేంద్రీకరించాల్సి వచ్చిందని కలెక్టర్ సి.నారాయణ రెడ్డి గుర్తు చేశారు. ప్రస్తుతం కోవిడ్ తీవ్రత దాదాపుగా తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో జిల్లాకు సంబంధించిన హెల్త్ ప్రొఫైల్‌ను అప్డేట్ చేయించాలని వైద్య ఆరోగ్య శాఖ అధికారులను ఆదేశించారు. మంగళవారం స్థానిక ప్రగతి …
Read More »విద్యను ఆయుధంగా మల్చుకుంటేనే ఉత్తమ భవితవ్యం
నిజామాబాద్, ఏప్రిల్ 19 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఉన్నతమైన భవిష్యత్తు కోసం విద్యను ఆయుధంగా మలచుకోవాలని కలెక్టర్ సి.నారాయణరెడ్డి సూచించారు. ప్రభుత్వ సాంఘిక సంక్షేమ వసతి గృహాలకు చెందిన పదవ తరగతి విద్యార్థిని, విద్యార్థులకు మంగళవారం జిల్లా కేంద్రంలోని న్యాల్ కల్ రోడ్డులో గల ఆనంద నిలయం హాస్టల్‌లో ఎస్సీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ప్రేరణ కార్యక్రమం ఏర్పాటు చేశారు. కలెక్టర్ నారాయణరెడ్డి ముఖ్య అతిథిగా హాజరై …
Read More »