కామారెడ్డి, మే 2
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఈ నెల 4వ తేదీ బుధవారం ఐవిఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు, తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి మండలి చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా 50వ జన్మదినాన్ని పురస్కరించుకొని రక్తదాన శిబిరాన్ని వీ.టి ఠాకూర్ బ్లడ్ బ్యాంకులో ఏర్పాటు చేయడం జరిగిందని జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు విశ్వనాధుల మహేష్ గుప్తా, గోవింద్ భాస్కర్ గుప్తా, జిల్లా సేవాదళ్ చైర్మన్ బాలు గుప్తా తెలిపారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఉప్పల శ్రీనివాస్ గుప్తా, తెలంగాణ యూనివర్సిటీ వైస్ ఛాన్స్లర్ దాచేపల్లి రవీందర్ గుప్తా విచ్చేస్తున్నారన్నారు. మానవతావాది,సామాజిక సేవా తత్పరుడు, పేదలకు ఆర్యవైశ్యులకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ సహాయ సహకారాలు అందిస్తున్న ఉప్పల శ్రీనివాస్ గుప్తా జన్మదిన వేడుకల సందర్భంగా శిబిరం ఏర్పాటు చేయడం సంతోషదాయకం, ఇలాంటి వ్యక్తులు నేటి సమాజానికి స్ఫూర్తిదాయకమని వీరిని స్ఫూర్తిగా తీసుకొని సమాజసేవలో ముందుకు రావాలన్నారు.
కార్యక్రమాన్ని కామారెడ్డి జిల్లా ఆర్యవైశ్య బంధువులు అందరూ విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా నాయకులు కోడిశాల గంగాధర్ గుప్తా, కోశాధికారి వలిపిశెట్టి లక్ష్మీరాజ్యం గుప్తా తదితరులు పాల్గొన్నారు.