నిజామాబాద్, మే 2
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మరణించిన తర్వాత తమ పార్ధివదేహాన్ని సమాజ హితం కోసం, విద్యార్థుల ప్రయోగాలకు ఉపయోగపడేలా ప్రభుత్వ మెడికల్ కాలేజీకి దానం చేయడం ఆదర్శనీయమైన నిర్ణయమని సిపిఐ (ఎం.ఎల్) ప్రజాపంథా నగర కార్యదర్శి ఎం.సుధాకర్ అన్నారు.
బ్రాహ్మణపల్లి సావిత్రి (80), నివాసం కేశారం గ్రామం. ఈరోజు మధ్యాహ్నం 1.28 నిమిషాలకు మరణించారు. ఆమె కూతురు విజయ అల్లుడు నారాయణ, కుటుంబ సభ్యులు కలిసి ఆమె దేహాన్ని ప్రభుత్వ మెడికల్ కాలేజీకి విద్యార్థుల ప్రయోగ కోసం ఉపయోగపడుతుందని దానం చేశారు. ఇది వారి కుటుంబ సభ్యులు తీసుకున్న ఆదర్శ నిర్ణయమని సిపిఐ (ఎం.ఎల్) ప్రజాపంథా పార్టీ నగర కార్యదర్శి ఎం.సుధాకర్ అభినందించారు.
ఒక మనిషి మరణిస్తే వారి కుటుంబ సభ్యులు దేహాన్ని పూడ్చడం, కానీ కాల్చడం కానీ చేయడం సాధారణమేనన్నారు. మెడికల్ కాలేజీకి శరీరాన్ని అప్పగిస్తే విద్యార్థులకు ప్రయోగాలకు, నేర్చుకోవడానికి మనిషి యొక్క దేహము ఉపయోగపడుతుందన్నారు. ఇది కుటుంబ సభ్యులు చైతన్యంతో తీసుకున్న నిర్ణయమన్నారు. సిపిఐ (ఎం.ఎల్) ప్రజా పంథా నిజామాబాద్ నగర కమిటీ సావిత్రికి జోహార్లు తెలిపారు.
ఆమె కుటుంబ సభ్యులు తీసుకున్న నిర్ణయం సమాజానికి ఆదర్శం కావాలని, ప్రజలు ఇలాంటి వాటిని ప్రోత్సహించాలనీ ఆస్పత్రి వైద్యులు నాగ మోహన్ కోరారు. ఈ సందర్భంగా సావిత్రి కుటుంబ సభ్యులను, బంధువులను డాక్టర్ నాగ మోహన్ అభినందించారు. ఆనంతరం డాక్టర్‌కి సావిత్రి మృతదేహాన్ని కుటుంబ సభ్యులు అప్పగించారు. కార్యక్రమంలో సావిత్రి కూతురు విజయ, అల్లుడు నారాయణ, కుటుంబ సభ్యులు లింగయ్య, రవీందర్, ప్రభాకర్, సాయిలు, మోహన్, ప్రసాద్, సంధ్యారాణి, ఇఫ్టు నాయకుడు కిరణ్ తదితరులు పాల్గొన్నారు.