నందిపేట్, మే 2
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : భారతదేశమంతట భక్తి శ్రద్ధలతో ఉపవాస వ్రతాలు పాటించిన ముస్లింలు మంగళవారం ఈద్ ఉల్ ఫితర్ పండుగ జరుపుకోనున్నారు. అలాగే నిజామాబాద్ జిల్లాలోని నందిపేట్ మండలంలోని ముస్లింలు మంగళవారం ఉదయం ఇద్ నమాజ్ కొరకు ముందస్తుగా సోమవారం ఈద్ గాప్‌ాలను ముస్తాబు చేశారు. గ్రామ పంచాయతీ పాలక వర్గం శుభ్రత పనులు చేపట్టగా ముస్లిం కమిటీలు టెంట్ షామియాణాలు వేశారు.
నెల రోజుల పాటు మండుటెండలను సైతం లెక్కచేయకుండా కఠోర ఉపవాస దీక్షలు చేపట్టిన ముస్లింలు సోమవారానికి 30 దినాలు పూర్తి కావడంతో సాయంత్రం ఉపవాస దీక్షలు విరమించి మంగళవారం (ఈద్-ఉల్-ఫితర్) పర్వదినాన్ని జరుపుకోవాలని ముస్లిం మత పెద్దలు ప్రకటించారు. దీంతో అన్ని రకాలుగా సిద్ధంగా ఉన్న ముస్లింలు మంగళవారం ఉదయం కొత్త బట్టలు ధరించి సామూహికంగా తక్బీర్ చెప్తూ గ్రామాల సమీపంలోని ఈద్గాల వద్ద చేరుకుని ఫేస్ ఇమామ్ ఆధ్వర్యంలో ప్రత్యేక సామూహిక ప్రార్థనలు చేస్తారు.
ఎంపిపి, సంతోష్, జడ్‌పిటిసి ఎర్రం యమున ముత్యం, నందిపేట్ సర్పంచ్ ఎస్‌జి వాణి తిరుపతి, కో అప్సన్ మెంబెర్ సయ్యద్ హుస్సేన్, మండల ముస్లిం కమిటీ నాయకులు కాలీమ్, గౌస్ తదితరులు మండల ప్రజలకు ఈద్ శుభాకాంక్షలు తెలిపారు.