కామారెడ్డి, మే 2
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి పట్టణంలోని నర్సరీని సోమవారం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ పరిశీలించారు. నర్సరీలో ఉన్న మొక్కలు వివరాలను అడిగి తెలుసుకున్నారు.
పట్టణంలో ఖాళీ స్థలాలను గుర్తించి హరిత హారంలో మొక్కలు నాటడానికి గుంతలు తీయించాలని అధికారులకు సూచించారు. గృహాలకు ఇవ్వడానికి అనువైన మొక్కలను పెంచాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ వెంకటేష్ ధోత్రే, మునిసిపల్ అధికారులు పాల్గొన్నారు.