నిజామాబాద్, మే 2
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రజావాణి పెండిరగ్ దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలని అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ వివిధ శాఖల అధికారులను ఆదేశించారు. ప్రజావాణి కార్యక్రమం ఎంతో ప్రాధాన్యతతో కూడుకుని ఉన్నందున దరఖాస్తుల పరిష్కారానికి అంకితభావంతో కృషి చేయాలని హితవు పలికారు. ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం కలెక్టరేటులోని ప్రగతి భవన్‌లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 67 ఫిర్యాదులు అందాయి.
జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి కలెక్టరేటుకు తరలివచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను అదనపు కలెక్టర్ చంద్రశేఖర్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ చిత్రామిశ్రా, జిల్లా పరిషత్ సీఈఓ గోవింద్ లకు విన్నవిస్తూ అర్జీలు సమర్పించారు. కాగా, ప్రజావాణి అర్జీలకు ప్రాధాన్యతనిస్తూ వెంటదివెంట పరిష్కరించాలని అదనపు కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ప్రజావాణి వినతులపై తీసుకున్న చర్యల గురించి ఫిర్యాదుదారులకు తప్పనిసరిగా సమాచారం తెలియజేస్తూ, ప్రజావాణి సైట్‌లో పూర్తి వివరాలు అప్‌లోడ్ చేయాలన్నారు.