కామారెడ్డి, మే 2
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మే 10 లోగా మన ఊరు మన బడి మొదటి విడతలో ఎంపికైన పాఠశాలలకు ప్రతిపాదనలు పూర్తిచేయాలని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు, రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. సోమవారం వారు హైదరాబాద్ నుంచి వీడియో కాన్ఫరెన్సులో జిల్లా స్థాయి అధికారులతో మాట్లాడారు.
ఉపాధి హామీ పథకం కింద గుర్తించిన పనులకు ప్రతిపాదనలు తయారు చేయాలని కోరారు. 30 లక్షల రూపాయల విలువైన పనులను మే 15 లోగా ప్రతిపాదనలు పూర్తిచేయాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. మే 30 లోగా పనులను పూర్తి చేయాలని పేర్కొన్నారు.
జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ మాట్లాడుతూ జిల్లాలో మన ఊరు మన బడి కార్యక్రమం కింద 351 పాఠశాలలు ఎంపికైనట్లు చెప్పారు. ప్రతిపాదనలను త్వరితగతిన తయారు చేయిస్తామని పేర్కొన్నారు. వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లా స్థానిక సమస్తల అదనపు కలెక్టర్ వెంకటేష్ ధోత్రే, డిఈవో రాజు, ఇంజనీరింగ్ అధికారులు, విద్యాశాఖ అధికారులు పాల్గొన్నారు.