నిజామాబాద్, మే 2
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకుని రాష్ట్ర రోడ్లు-భవనాలు, గృహ నిర్మాణ శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, కలెక్టర్ సి.నారాయణ రెడ్డి జిల్లా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.
పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా మండుటెండల్లోనూ ముస్లిం మైనారిటీలు ఎంతో నియమ నిష్ఠతో నెల రోజుల పాటు ఉపవాస దీక్షలు నిర్వర్తించారని అన్నారు. ఉపవాస దీక్షల పుణ్య ఫలంతో తెలంగాణ రాష్ట్రం, నిజామాబాద్ జిల్లా సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు. అన్ని వర్గాల ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని, సౌభ్రాతృత్వం వెల్లివిరియాలని కోరుకున్నారు.
నెల రోజుల పాటు ప్రత్యేక ప్రార్థనలు, ఉపవాస దీక్షలు, దాన ధర్మాలతో ఆధ్యాత్మిక కార్యక్రమాలలో నిమగ్నమైన ముస్లింలు, అదే స్ఫూర్తితో మంగళవారం నాటి ఈద్-ఉల్-ఫితర్ నమాజ్‌ను కూడా భక్తి శ్రద్ధలతో జరుపుకోవాలని కోరారు.