గాంధారి, మే 2
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : వృద్దులు, వికలాంగులు, మహిళల కోసం ఉచిత బస్ సర్వీస్ ను సోమవారం కాంగ్రెస్ నాయకులు ప్రారభించారు. గాంధారి మండల కేంద్రం నుండి కామారెడ్డి వరకు బస్ నడపనున్నట్లు తెలిపారు. ఎల్లారెడ్డి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కో ఆర్డినేటర్ వడ్డేపల్లి సుభాష్ రెడ్డి తన స్వచ్చంద సేవా సంస్థ ఆధ్వర్యంలో ఈ బస్ సర్వీస్ కొనసాగుతుందని అన్నారు.
ప్రతి రోజు గాంధారి నుండి కామారెడ్డికి వివిధ పనుల నిమిత్తం చాలా మంది వెళ్తుంటారని కానీ మహిళలు, వృద్ధులు, వికలాంగులు ప్రయాణ సమయంలో ఇబ్బంది పడుతుంటారని గ్రహించిన సుభాష్ రెడ్డి ఉచిత బస్ నడపాలని నిర్ణయం తీసుకున్నారని వారు తెలిపారు.
బస్ సర్వీస్ పూర్తిగా ఉచితమని మహిళలు, వృద్ధులు, వికలాంగులు వినియోగించుకోవాలని సూచించారు. ఈ సందర్బంగా ఉచిత బస్ సర్వీస్ ఏర్పాటు చేసినందుకు సుభాష్ రెడ్డి కి ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో ఎంపీటీసీ బాలరాజ్, కాంగ్రెస్ నాయకులు లైన్ రమేష్, మదార్, మిట్యా నాయక్, శుభాష్, స్వామి తదితరులు పాల్గొన్నారు.