సేవా భారతి ఆధ్వర్యంలో టెట్‌ శిక్షణ

కామారెడ్డి, మే 2

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని వశిష్ట డిగ్రీ పీజీ కళాశాలలో సేవాభారతి కామారెడ్డి జిల్లా శాఖ ఆధ్వర్యంలో టెట్‌ పేపర్‌ -1 ఉచిత శిక్షణ తరగతులు కొనసాగుతున్నాయని శిక్షణ తరగతుల సమన్వయకర్త మార బాల్‌ రెడ్డి, కోర్స్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ వేద ప్రకాష్‌ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ప్రముఖ సైకాలజీ స్టేట్‌ పేమ్‌ ఫ్యాకల్టీ, కోర్స్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ వేద ప్రకాష్‌ మాట్లాడుతూ కష్టంతో కాకుండా ఇష్టంతో చదవాలని, ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకుని వాటిని సాధించడానికి కృషి చేయాలన్నారు.

ఈ అవకాశాన్ని వినియోగించుకొని టెట్‌లో అత్యధిక మార్కులు సాధించాలనీ ఆకాంక్షించారు. ఈ అవకాశాన్ని పేద విద్యార్థులు ఉపయోగించుకోవాలని, రాష్ట్ర స్థాయి అధ్యాపక బృందంచే శిక్షణా తరగతులను కొనసాగించడం జరుగుతుందని 30 రోజులపాటు ఈ శిక్షణను అందిస్తామన్నారు.

అడ్మిషన్లను పరిమిత సంఖ్యలో తీసుకోవడం జరుగుతుందని ఆసక్తి కలిగిన విద్యార్థులు ఈ నెల 4వ తారీకు లోపు గా నమోదు చేసుకోవాలన్నారు. తరగతులకు వచ్చే విద్యార్థులకు ఉచిత మెటీరియల్‌తో పాటు, మధ్యాహ్న భోజనం అందిస్తున్నామని పేర్కొన్నారు. మరిన్ని వివరాలకు మరియు 9440422840 నెంబర్‌కు సంప్రదించాలన్నారు.

Check Also

దివ్యాంగులకు క్రీడా పోటీలు

Print 🖨 PDF 📄 eBook 📱 నిజామాబాద్‌, నవంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »