నందిపేట్, మే 2
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రంజాన్ మాసం దాన దర్మాల మాసంగా ముస్లిం ప్రజలు గుర్తించి తమ సంపాదనలోని కొంత భాగాన్ని పేద ప్రజల హక్కుగా భావించి భావించి వరాల వసంత మైన రంజాన్ మాసంలో విరివిగా దానధర్మాలు చేస్తారని జమాతే ఇస్లామి హింద్ కన్వీనర్ ఆఫ్రోజ్ ఖాన్ తెలిపారు. జమాతే ఇస్లామి హింద్ నందిపేట్ శాఖ ఆధ్వర్యంలో మండల కేంద్రంలోని మస్జీద్ మౌజా బింతే అలీ చుట్టూ ప్రక్కల గల ఎన్టీఆర్ కాలనీలో, బజార్ కొత్తూరులోని పేద ముస్లింలకు ఈద్ కిట్లను పంపిణీ చేశారు.
పేద ధనిక ప్రజలందరూ కలిసి ఈద్ పండుగ సంతోషంగా జరుపుకోవాలని ఉద్దేశంతో జమాత్ సభ్యలు, సానుభూతి పరులు తమ సంపాదనలో నుండి జకత్ రూపంలో చెల్లించిన రూపాయలతో ఈద్ కిట్ కొనుగోలు చేసి పంపిణీ చేసినట్లు ఆయన వెల్లడిరచారు ఎలాంటి ఫోటోలు తీయకుండా తమ ఇంటి గుమ్మం వద్ద పెట్టి వెళ్లి తమ ఆత్మ గౌరవము పెంచడం పట్ల ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు.
కార్యక్రమంలో మజీద్ కమిటీ అధ్యక్షుడు షేక్ గౌస్, టిఆర్‌ఎస్ మండల మైనారిటీ సెల్ అధ్యక్షుడు షేక్ పాషా, ఉర్దూ స్కూల్ చైర్మన్ అబ్దుల్ బాఖి, జమాత్ సభ్యలు రఫీ, ఫారూక్ ఖాన్, బిలాల్, కలీమ్, మహేబూబ్ ఖాన్, తదితరులు ఉన్నారు.